Homeఎంటర్టైన్మెంట్Nagarjuna new daughter-in-law : కొత్త కోడలు ఇంటికి వస్తే, నాగార్జున మాత్రం ఏం చేస్తున్నారో...

Nagarjuna new daughter-in-law : కొత్త కోడలు ఇంటికి వస్తే, నాగార్జున మాత్రం ఏం చేస్తున్నారో చూడండి!

Nagarjuna new daughter-in-law : ఆరు నెలల వ్యవధిలో అక్కినేని వారి ఇంట రెండు పెళ్లి వేడుకలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో నాగ చైతన్య వివాహం జరిగింది. కొన్నాళ్లుగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్న నాగ చైతన్య ఆమెను పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. శోభిత ధూళిపాళ్లకు నాగార్జున గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక జూన్ 6న రెండో కుమారుడు అఖిల్ వివాహం ఘనంగా జరిగింది. నాగార్జున ఇల్లు వేదికగా ఈ వేడుక చోటు చేసుకుంది.

ఓ బడా వ్యాపారవేత్త కుమార్తె అయిన జైనబ్ తో అఖిల్ ఏడడుగులు వేశాడు. ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. దాంతో అఖిల్ కి జైనబ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసిందని సమాచారం. వివాహం అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య, వెంకటేష్, యష్, నానితో పాటు పలువురు స్టార్స్ సందడి చేశారు.

Also Read : ‘కుబేర’ లో నాగార్జున రోల్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా?

కాగా అఖిల్ పెళ్ళై నాలుగు రోజులు కూడా కాలేదు. నాగార్జున మాత్రం బిజీ అయ్యారు. కొత్త కోడలితో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం నాగార్జున దక్కలేదు. అందుకు కారణం కుబేర మూవీ. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందాన ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ప్రోమోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బరువైన కథలో ముగ్గురి పాత్రలు ఇంటెన్స్ తో కూడి ఉంటాయని అర్థం అవుతుంది. కుబేర చిత్రం మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక పాన్ ఇండియా సినిమాగా కుబేర విడుదల అవుతున్న నేపథ్యంలో భారీగా ప్రమోట్ చేస్తున్నారు. చెన్నై వేదికగా మొదటి ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ధనుష్, నాగార్జున, రష్మిక తో పాటు దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. నెక్స్ట్ ముంబైలో ఈవెంట్ నిర్వహించనున్నారు. కుబేర ప్రమోషన్స్ కోసం నాగార్జునతో పాటు కుబేర టీమ్ ముంబై పయనమైంది. అలాగే బెంగుళూరులో సైతం ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం. కుబేర చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జున.. కుమారుడు అఖిల్ వివాహం జరిగి వారం కూడా కాకున్నా.. ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడన్నమాట. కమిట్మెంట్ అంటే ఇది కదా అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular