Nagarjuna : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకు అన్ని సినిమా ఇండస్ట్రీ ల నుంచి వచ్చిన హీరోలు పాన్ ఇండియాలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మాత్రం పాన్ ఇండియాలో ఒక్క భారీ సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలంటే మాత్రం వాళ్ళు భారీ గుర్తింపును తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియాలో సినిమాలను చేసిన వాళ్లకు మాత్రమే ఇండియాలో గొప్ప మార్కెట్ అయితే ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అవ్వాలన్న వాళ్ళ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సాధించాలన్నా కూడా వాళ్లకు పాన్ ఇండియా మార్కెట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఒకప్పుడు రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Hasan) లాంటి హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ క్రేజ్ కూడా భారీగా తగ్గిపోయింది. మరి ఇప్పుడున్న స్టార్ హీరోల్లో సూర్య( Surya), కార్తీ (Karthi) లాంటి హీరోలు పాన్ ఇండియాను శాసించే సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేటు గుర్తింపును సంపాదించుకున్నప్పుడు మాత్రమే వాళ్లు మిగతా భాషల హీరోలతో పోటీ పడతారు… ఇక లోకేష్ కనకరాజ్ (Lokesh Kanka Raj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా వస్తున్న కూలీ(Cooli) సినిమాలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే…
రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సైతం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక నాగార్జున (Nagarjuna) బ్యాక్ స్టార్ట్ అయితే పలు రికార్డులను కూడా క్రియేట్ చేసిందనే చెప్పాలి. మరి ఇప్పటివరకు నాగార్జున చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…
రజినీకాంత్ ఎంత విజిల్ వేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయాలని చూసినప్పటికి ఒక్క బ్యాక్ షాట్ తో రజినీకాంత్ ఇమేజ్ ను సైతం డామేజ్ చేశాడు. ఇక ఇదంతా చూస్తుంటే ఈ సినిమాలో నాగార్జున హైలెట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ఫుల్గా నిలిపేది కూడా నాగార్జుననే అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…