Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఒక్కో సమయంలో ఒక్కో టైం నడుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి సమయం నడిచినప్పుడు సక్సెస్ లు వస్తుంటాయి. ఇక చెడు సమయం నడిచినపుడు చాలా వరకు చెడు జరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ సినిమాలు ప్లాప్ అవ్వడం, పర్సనల్ లైఫ్ లో కూడా పెద్దగా ఆనందం లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇక ప్రస్తుతం నాగార్జున పరిస్థితి కూడా అలానే ఉంది. తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తను ఎంతో ఇష్టంగా నిర్మించుకో ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది. దాని ద్వారా ఆయన కొంతవరకు నిరుత్సాహంతో ఉన్నాడు. రీసెంట్ గా అధికార పార్టీలో ఉన్న మంత్రి ఆయన కొండా సురేఖ సమంతను, అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దాంతో నాగార్జున ఇప్పుడు చాలావరకు డీలపడ్డాడనే వార్తలు వస్తున్నాయి. ఇక వాళ్ళు ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోకుండా ఒక మనిషిని ఎలాగోలాగా డీ గ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యం తో నోటికి ఇది వస్తే అది మాట్లాడుతుంటారు. కానీ జనాలకు తెలియదు కదా వాళ్ళు వాటిని నిజాలనే నమ్మేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున ఫ్యామిలీకి వరుసగా ఎదురు దెబ్బలైతే తగులుతున్నాయి. మరి వాటిని ఓర్చుకొని నాగార్జున నిలబడగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం నాగార్జున తెలుగులోనే అత్యంత పెద్ద షో అయిన ‘బిగ్ బాస్ షో’ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ షో విషయం లో ఆయన కొంత వరకు యాక్టివ్ గా ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. ఎదురు దెబ్బలు తగులుతున్న సమయంలో ఆయన ఈ షో ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయనకి షో చేసే ఇంట్రెస్ట్ కూడా లేనట్టుగా తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ షో చేస్తున్నాడు అంటే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ షోని చేస్తున్నాడు. వచ్చే సీజన్ నుంచి నాగార్జున ఈ షో కి హోస్ట్ గా చేయకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే నాగార్జున అటు పర్సనల్ గా ఇటు ప్రొఫెషనల్ గా చాలా వరకు దెబ్బతిని ఉన్నాడు. కాబట్టి తను రెస్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన అనుకున్నట్టుగానే రెస్ట్ తీసుకుంటాడా లేదంటే పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతాడా అనేది తెలియాల్సి ఉంది…