Oscar Awards 2025
Oscar Awards 2025: తెలుగు సినిమా ఇండస్ట్రీ రోజురోజుకీ భారీ రేంజ్ లో విస్తరిస్తుంది. మొన్నటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితమైన మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్లడం విశేషం… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ప్రతి హీరో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోలు కూడా కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మన సినిమా స్థాయి మారిపోయింది. కాబట్టి అవార్డులు కూడా చాలా పెద్ద మొత్తంలో మన ఇండస్ట్రీ ని పలకరిస్తున్నాయి. నేషనల్ అవార్డు విషయం పక్కన పెడితే ప్రస్తుతం మన వాళ్లు ఆస్కార్ అవార్డు రేసులోనే ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు ఏమి రావు అని విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి గురించి మాట్లాడుతూ ఉండడం విశేషం.
ఇక మొత్తానికైతే ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తున్న మన సినిమాలు ఆస్కార్ రేసులో నిలవడం విశేషం…ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పోటీలో ఉంది. ఇక ఈ సినిమాలో హనుమాన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హాలీవుడ్ లో ఎలాంటి సూపర్ హీరో సినిమాలైతే వస్తాయో వాటికి దీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా కూడా ఆస్కార్ రేసు లో ఉంది. మరి మొత్తానికైతే ఈ సినిమా డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఇండియాలో రాబోయే సంవత్సరాలలో జనాల పరిస్థితి ఎలా ఉండబోతుంది. కలిని చంపడానికి కల్కి ఎలా రాబోతున్నాడు అనే పాయింట్ ను ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. ఇక విష్ణు మూర్తి అవతారాలలో చివరి అవతారమైన కల్కి ఎప్పుడు వస్తాడు అనే దాని మీద క్యూరియాసిటీని రేకేతిస్తూ ఈ సినిమాను తీసిన విధానమైతే బాగుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం లో సక్సెస్ అయింది…
ఇక అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ కి అలాగే విజువల్స్ కి చాలా మంచి పేరు అయితే వచ్చింది. మరి ఈ సినిమా కూడా ఆస్కార్ రేస్ లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరపున ముందుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ఈ మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ రేస్ లో ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…