Nagarjuna Is Great: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు (Nageshwara Rao) కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికి అతను మార్చుకున్న విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అంత ఇంత కాదు. తనను తాను గొప్పగా మార్చుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలే… ఆయన నటన చూసి సగటు ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో చేస్తున్న కుబేర (Kubera) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో నాగార్జున ధనుష్ పక్కన నిల్చున్నాడు. నాగార్జున పక్కన రష్మిక మందాన నిలబడింది. దాంతో నాగార్జున తను హీరో కాదు కాబట్టి హీరో, హీరోయిన్లు ఒక పక్కన ఉండాలి తను ఇంకొక పక్కన ఉండాలి అనే ఉద్దేశ్యంతో తను పక్కకు జరిగి రష్మికను ధనుష్ పక్కన నిల్చోబెట్టడు. మొత్తానికైతే నాగార్జునకి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనే విషయం అతనికి చాలా బాగా తెలుసు అంటూ నెటిజన్లు ఈ వీడియోని చూసి కామెంట్స్ చేస్తున్నారు…అలాగే బాలీవుడ్ హీరోలు మన హీరోలను చూసి బాగా నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…
Also Read: Nagarjuna : ఒక్క షాట్ తో అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతున్న నాగార్జున..?
ఇక ఇప్పటికే కుబేర సినిమాలో నాగార్జున పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ శేఖర్ కమ్ముల చెప్పాడు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా వల్ల మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరి మొత్తానికైతే ఈయనది పాజిటివ్ క్యారెక్టరా? నెగెటివ్ క్యారెక్టరా అని చెప్పడం లేదు. కానీ ఆయన పాత్రకి మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు… ప్రేక్షకుల ముందుకు వస్తూనే పెద్దాయన సినిమా ఎలాంటి ద్వారా ధనుష్ కి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును ఇస్తుంది.
అలాగే శేఖర్ కమ్ముల సైతం ఇప్పుడు భారీ గుర్తింపును సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…