Chiranjeevi: నాగార్జున కొత్త కోడలిని చూసిన చిరంజీవి రియాక్షన్ ఏమిటో తెలుసా? ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నాగార్జున ఇంటికి కోడలిగా వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వైజాగ్ వేదికగా నాగ చైతన్య-శోభితల వివాహం జరగనుంది. అప్పుడే అక్కినేని ఫ్యామిలీ వేడుకలు, కార్యక్రమాల్లో శోభిత పాల్గొంటుంది. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ వేడుకలో చిరంజీవికి నాగార్జున కాబోయే కోడలు శోభితను పరిచయం చేశాడు.

Written By: S Reddy, Updated On : October 29, 2024 8:23 am

Chiranjeevi(21)

Follow us on

Chiranjeevi: నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట ఫోటోలు ఒకటి రెండుసార్లు లీక్ అయ్యాయి. అయినప్పటికీ ఎఫైర్ రూమర్స్ ని ఇద్దరు ఖండించారు. సడన్ గా ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున వారి నిశ్చితార్థాన్ని ధృవీకరించారు. అక్కినేని కుటుంబంలోకి శోభిత ధూళిపాళ్లకు ఆహ్వానం పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశాడు.

వైజాగ్ వేదికగా నాగ చైతన్య-శోభితల వివాహం జరగనుంది. ఆల్రెడీ పెళ్లి వేడుకలు, సాంప్రదాయాలు మొదలయ్యాయి. పసుపు వేడుకకు సంబంధించిన ఫోటోలు శోభిత ధూళిపాళ్ల ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక శోభిత కోడలిగా రావడం పట్ల నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. శోభితను నాగార్జున చిరంజీవికి పరిచయం చేశాడు.

2024కి గాను ఏఎన్నార్ నేషనల్ అవార్డు చిరంజీవికి ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానం కార్యక్రమం హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. శోభిత ధూళిపాళ్ల సైతం హాజరైంది. కార్యక్రమం చివర్లో చిరంజీవికి నాగార్జున కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు.

ఈ క్రమంలో శోభితను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. దూరంగా ఉన్న శోభితను పిలిచి చిరంజీవికి చూపించారు. అక్కినేని వారి కొత్త కోడలిని చిరంజీవి ఆప్యాయంగా పలకరించాడు. శోభిత-చిరంజీవి ఒక అర నిమిషం మాట్లాడుకున్నారు. ఈ సన్నివేశం కార్యక్రమానికి హైలెట్ గా నిలిచింది. కాగా శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఆమె పుట్టారు. వైజాగ్, ముంబైలలో చదువుకున్నారు.

అనంతరం మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. శోభిత బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. మంకీ మ్యాన్ టైటిల్ తో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలో సైతం శోభిత నటించింది. మరోవైపు నాగ చైతన్య విడాకులు అనంతరం శోభితకు దగ్గరయ్యాడు. వీరికి పరిచయం ఎలా ఏర్పడింది అనేది తెలియదు. కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.

హీరోయిన్ సమంతను నాగ చైతన్య 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021లో మనస్పర్థలు తలెత్తాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ కాగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.