Nagarjuna: దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్ పేరే ముందు ఉంటుంది. కాకపోతే ఈ మధ్య దేవి ఫుల్ ఫామ్ లో లేడు. అయినా దేవి దగ్గరకే భారీ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో సల్మాన్ చిత్రాలకే ఒకటో రెండో పాటలు కొట్టే దేవీ తాజాగా రణ్‌వీర్ సింగ్ తదుపరి చిత్రం సర్కస్ కి సంగీతం అందించబోతున్నాడు. అయితే అన్ని పాటలకు కాదు, ప్రత్యేకంగా ఓ సాంగ్ ఉంటుందని.. ఆ పాటకు దేవీ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పైగా ఇటీవల పుష్ప గురించి ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని తెలిపాడు దేవీ.

Also Read: ఆర్ఆర్ఆర్ పై హైప్ పోతుంది… రాజమౌళి నెక్స్ట్ ప్లాన్ ఏంటీ?
ఇక మరో క్రేజీ ఆల్ డేట్ విషయానికి వస్తే..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్టార్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొని ప్రజలందరూ బాగుండాలని స్వామివారని కోరుకున్నాను అని, రెండు సంవత్సరాల తరువాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని నాగార్జున తెలిపారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అలాగే నాగార్జున ఫ్యామిలీ విజయవాడ అమ్మవారిని కూడా దర్శర్శించుకోబోతునట్లు తెలుస్తోంది.

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమందికి సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కాగా తాజాగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న పేద చిన్నారులకి తన సొంత ఖర్చులతో మహేష్ ఆపరేషన్ చేయిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు 1058 మంది పిల్లలని కాపాడారు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
Also Read: ‘ఆచార్య’తో ‘శ్యామ్ సింగరాయ్’.. వైరల్ అవుతున్న పిక్ !