Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన తన వందో సినిమానైతే చేస్తున్నాడు. కార్తీక్ అనే తమిళ దర్శకుడు డైరెక్షన్లో ఆయన సినిమా చేస్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో అతనికి చాలా ప్రత్యేకంగా నిలిచిన సినిమాలు మాత్రం రెండే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి శివ సినిమా కాగా, రెండు అన్నమయ్య సినిమా కావడం విశేషం…నాగార్జున చేసిన అన్ని సినిమాలు అతనికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని అందించాయి. ప్రేక్షకుల్లో సైతం నాగార్జున వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తాడు అనే నమ్మకాన్ని ఇచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన తోటి హీరోలందరు సెక్యూర్ జోన్ లో ముందుకు సాగుతుంటే నాగార్జున మాత్రం ఎక్స్పరిమెంట్లు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులను, కొత్త కంటెంట్లను పరిచయం చేస్తూ వచ్చాడు. అందువల్లే నాగార్జునకి చాలా ప్రత్యేకమైన ఐడెంటిటి వచ్చింది…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన నాగార్జున నుంచి వచ్చే సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన కూలీ, కుబేర సినిమాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా నాగార్జున చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండడం విశేషం… తన వందో సినిమాతో మరో ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడు. దాంతో ఆయన ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇప్పటికి సీనియర్ హీరోలందరు కమర్షియల్ ఎంటర్టైనర్ లను నమ్ముకుంటూ ముందుకు సాగుతుంటే నాగార్జున మాత్రం డిఫరెంట్ ప్రయత్నాలను చేస్తున్నాడు. మరి మరోసారి ఆయన చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
