Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ షో నుంచి నాగార్జున తప్పుకుంటున్నారా? అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. బిగ్ బాస్ షోకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టిన హీరో నాగార్జున. కానీ సినిమాలు చేస్తూ ఈ షో నిర్వహణ అంత సులభంగా లేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఈ షో నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ అభిమానులకు నిరాశే కానుంది. ఇన్నాళ్లు బిగ్ బాస్ షో అంటేనే నాగార్జున అనే స్థాయిలోకి తెచ్చిన యువ సామ్రాట్ ఇప్పుడు అర్థంతరంగా తప్పుకుంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఈ షో నుంచి నిష్ర్కమించడం మాత్రం ఖాయమనే తెలుస్తోంది. ఈనేపథ్యంలో బిగ్ బాస్ షో ఇకపై ఎలా నడుస్తుందనే సంశయాలు అందరిలో వస్తున్నాయి.

బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ నుంచి నాగార్జన హోస్టుగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు షోను కొత్తదనంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో సహజంగానే బిగ్ బాస్ పై అందరికి ఇష్టం ఏర్పడింది. ఎక్కువ మంది ప్రేక్షకులు బిగ్ బాస్ వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జున తప్పుకుంటున్నట్లు వార్తలు రావడం నిజంగా దురదృష్టమే అని చెబుతున్నారు. ఆరో సీజన్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: Secunderabad Gang Rape: ‘రేప్’ల రాజధాని: హైదరాబాద్ లో మరో బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్
బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టు చేశారు. రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని వచ్చారు. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున నిర్వహిస్తున్నారు. కానీ నాగార్జున రాకతోనే బిగ్ బాస్ కు అందం వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆయన తప్పుకుంటే షో నిర్వహణ కష్టమే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో నాగార్జున షో నుంచి దూరమైతే కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ఆయన ఏం చెబుతారో తెలియడం లేదు.

బిగ్ బాస్ షో పై విమర్శలు కూడా ఎక్కువే వచ్చాయి. ఒక దశలో నాగార్జున పై కూడా వచ్చాయి. అదంతా ఓ ట్రాష్ అని కంటెస్టెంట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం సాగింది. రాజకీయ నేతలు కూడా బిగ్ బాస్ షోను రద్దు చేయాలని వ్యాఖ్యానించడం తెలిసిందే. వీటన్నింటిపై దృష్టి సారించిన నాగార్జున కుటుంబ సభ్యులతో చర్చించినట్లు సమాచారం. దీంతో వారు ఇన్ని విమర్శల మధ్య పని చేయడం అవసరమా? అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన బిగ్ బాస్ కు దూరం కానున్నారనే వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వచ్చిన పుకారా? లేక నాగార్జున అంతర్మథనమా? అనేది తేలాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. ఐదో సీజన్ ముగిసే నాటికి నాగార్జున తప్పుకుంటారా? లేక కొనసాగుతారా? అనేది తెలుస్తోంది. అందాక మనం వేచి చూడాల్సిందే మరి. సో ప్రేక్షకులు కూడా అన్ని విషయాలు ఆయన చెప్పే వరకు ఆగాల్సిందే మరి.
Also Read:Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వివాదం: భారత్ , ముస్లిం దేశాల సంబంధాలపై ఎఫెక్ట్
[…] Also Read: Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున గుడ… […]
[…] Also Read: Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున గుడ… […]
[…] Also Read:Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున గుడ… […]