https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : లేడీ కంటెస్టెంట్స్ తో మణికంఠ ప్రవర్తనపై నాగార్జున సీరియస్ వార్నింగ్..సిగ్గుతో తలదించుకున్న మణికంఠ!

విష్ణు ప్రియ, నైనికా నవ్వుతూనే అతనికి చేస్తున్న తప్పుని వివరిస్తారు, దానికి మణికంఠ 'ఇక్కడికి వచ్చాక ఛిల్ అవ్వాలి..ఇంటికి వెళ్ళాక ఎలాగో భార్యతోనే కదా ఉండాలి' అని సమాధానం ఇస్తాడు. అయితే నాగమణికంఠ హగ్గులపై నగరును చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అతనిని నిన్ని కన్ఫెషన్ రూమ్ లోకి ప్రత్యేకంగా పిలిచి, యష్మీ ని మూడు సార్లు హత్తుకున్న వీడియో ని చూపిస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 22, 2024 / 08:41 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8  : ఈ సీజన్ లో ప్రేక్షకులకు చాలా తేడా గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతను ప్రారంభంలో చెప్పిన తన విచారకరమైన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కి ఈయన హౌస్ లో ప్రవర్తించే తీరుకి ఇసుమంత కూడా సంబంధం ఉండదు. భార్య మీద విపరీతమైన ప్రేమ ఉన్నోడి లాగా ఎమోషనల్ యాంగిల్ కోసం మాట్లాడుతాడు, కానీ హౌస్ లో ఉన్న ప్రతీ అమ్మాయిని సందర్భం ఉన్నా లేకపోయినా కౌగలించుకుంటాడు. ముఖ్యంగా ఈ వారం మొత్తం లో ఈయన లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు చూసే ఆడియన్స్ కి ఇతనికి అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుంది అని అనిపించేలా చేసింది.

    విష్ణు ప్రియ, నైనికా నవ్వుతూనే అతనికి చేస్తున్న తప్పుని వివరిస్తారు, దానికి మణికంఠ ‘ఇక్కడికి వచ్చాక ఛిల్ అవ్వాలి..ఇంటికి వెళ్ళాక ఎలాగో భార్యతోనే కదా ఉండాలి’ అని సమాధానం ఇస్తాడు. అయితే నాగమణికంఠ హగ్గులపై నగరును చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అతనిని నిన్ని కన్ఫెషన్ రూమ్ లోకి ప్రత్యేకంగా పిలిచి, యష్మీ ని మూడు సార్లు హత్తుకున్న వీడియో ని చూపిస్తాడు. ఆ తర్వాత యష్మీ ఇబ్బంది పడుతూ ‘ప్లీజ్ బిగ్ బాస్..అతన్ని ఆపండి, నా వల్ల కావడం లేదు’ అని అంటూ ఏడ్చే వీడియో ని కూడా చూపించాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ‘యష్మీ ఎంత ఇబ్బంది పడిందో చూడు..కేవలం యష్మీ మాత్రమే కాదు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ వీడియోస్ ఇప్పుడు నేను చూపించడం లేదు. ఇలాగే నీ తీరు కొనసాగితే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోతావ్’ అని అంటాడు.

    అప్పుడు మణికంఠ ‘దయచేసి నన్ను క్షమించండి సార్..ఒక్కేసారి నాకు అంత మంది స్నేహితులు పరిచయం అయ్యేలోపు నేను నా హద్దులను మర్చిపోయాను’ అని అంటాడు. ఈ ఎపిసోడ్ తర్వాత అయినా మణికంఠ మారుతాడో లేదో చూడాలి. ప్రత్యేకంగా పిలిచి ఈ విషయం పై కోటింగ్ ఇచ్చిన తర్వాత కూడా మణికంఠ అలాగే వచ్చే వారం అలాగే ప్రవర్తిస్తే మాత్రం కచ్చితంగా అతను తేడా మనిషే అని అనుకోవాలి. విచిత్రం ఏమిటంటే గేమ్స్ ఆడి అలిసిపోయి ఉన్న సోనియా ని లోపలకు తీసుకొచ్చి నాకు ఇప్పుడు హగ్గు కావాలి అంటూ మాట్లాడడం చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగించింది. ఇవంతా చూసిన తర్వాత అనేకమంది ప్రేక్షకులు అసలు ఇతనికి ఓట్లు వేస్తున్న వాళ్ళు ఎవరు అని ఆశ్చర్యపోతున్నారు. జనాలు గుడ్డిగా సానుభూతి కి పడిపోతారా..?, అతను ఎలాంటి వాడు అనేది గమనించారా అని కామెంట్స్ చేస్తున్నారు. అనేక సందర్భాలలో ఆయన సంబంధం లేకుండా ‘నాకు నా భార్య పిల్లలు కావాలి..ఈ షో గెలిస్తేనే వాళ్ళు నా దగ్గరకు వస్తారు’ అనే డైలాగ్ ని వాడడం ని చూస్తే ఇతను కావాలని సానుభూతి డ్రామాలు వేస్తున్నాడు అనే విషయం జనాలకు అర్థం కావడం లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.