Nagarjuna Ghost Pre- Review: ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 5 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే సినిమాలలో మంచి అంచనాలను ఏర్పర్చుకున్న సినిమాలలో ఒకటి ఘోస్ట్..ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్ మరియు ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో సతమతవుతున్న అక్కినేని నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు..ఇప్పుడు ఘోస్ట్ సినిమాతో జైత్ర యాత్ర ని కొనసాగించబోతున్నాడని అక్కినేని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు..ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఈవెంట్ కి అక్కినేని అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు..అభిమానుల్లో కూడా మరింత జోష్ ని నింపింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.

ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది..సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చారు..అయితే ఈ సినిమా కి సంబంధించిన సెన్సార్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది..అక్కినేని నాగార్జున గారికి ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన తర్వాత అంతటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సెన్సార్ సభ్యులు మూవీ టీం ని పొగిడారట..ప్రవీణ్ సత్తారు సినిమాలంటేనే వైవిధ్యంగా ఉంటాయి..యూత్ లో ఆయన సినిమాలకు మంచి క్రేజ్ కూడా ఉంటుంది..ఈ సినిమా కూడా రొటీన్ కి బిన్నంగా..రక్తి కట్టించే స్క్రీన్ ప్లే తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారట..ఈ సినిమాలో ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్,పోస్ట్ ఇంటర్వెల్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.

ఒక సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లడానికి కథ , కథనం ఎంత ముఖ్యమో, కథలో అంతర్లీనంగా ఉండే ఎమోషన్స్ కూడా అంతే ముఖ్యం..ఘోస్ట్ సినిమాలో అది మిస్ అవ్వదట..ఇదంతా పక్కన పెడితే మాస్ ఆడియన్స్ కోసం ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట..వాటిల్లో చర్చి ఫైట్ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నట్టు సమాచారం..ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సౌండ్ మిక్సింగ్ కూడా అద్భుతంగా ఉంటుందట..ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ లో హై క్వాలిటీ తో తెరకెక్కిన ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న మాట..ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలంటే అక్టోబర్ 5 వరుకు వేచి చూడాల్సిందే.
[…] […]