https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఏం వార్నింగ్ స్వామీ.. ప్రియాంక, గౌతమ్ లకు ఇచ్చిపడేసిన నాగార్జున..

ఫినాలే రేసులో ప్రియాంక తనకు సపోర్ట్ చేయలేదని అమర్ గుర్రుగా ఉన్నాడు. అతన్ని కూల్ చేయడం కోసం గౌతమ్ పాయింట్స్ అర్జున్ కి కాకుండా అమర్ కి ఇచ్చేలా చేసింది. ఫినాలే అస్త్ర రేసులో టాప్ 4 కి వెళ్లిన గౌతమ్ తర్వాత టాస్క్ లో ఓడిపోయాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2023 / 06:52 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్, శోభ, ప్రియాంక… మొదటి నుండి గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీరియల్ బ్యాచ్ గా పాప్యులర్ అయిన ఈ ముగ్గురు ఒక టీమ్. వీరు ఒకరిని మరొకరు నామినేట్ చేసుకోరు. గత వారం కూడా ప్రియాంకను నాగార్జున ఓ విషయంలో తప్పుబట్టారు. బిగ్ బాస్ హౌస్లో గ్రాటిట్యూడ్ ఉండ కూడదు. కేవలం గేమ్ మాత్రమే ఆడాలి అన్నారు. అయితే ఫినాలే అస్త్ర టాస్క్ లో ప్రియాంక మరలా అదే చేసింది. కీలక సమయంలో గౌతమ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.

    ఫినాలే రేసులో ప్రియాంక తనకు సపోర్ట్ చేయలేదని అమర్ గుర్రుగా ఉన్నాడు. అతన్ని కూల్ చేయడం కోసం గౌతమ్ పాయింట్స్ అర్జున్ కి కాకుండా అమర్ కి ఇచ్చేలా చేసింది. ఫినాలే అస్త్ర రేసులో టాప్ 4 కి వెళ్లిన గౌతమ్ తర్వాత టాస్క్ లో ఓడిపోయాడు. దీంతో రేసు నుండి తప్పుకున్నాడు. తన పాయింట్స్ నుండి 140 ప్రశాంత్, అర్జున్, అమర్ లలో ఒకరికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. అమర్ కి ఇవ్వాలని ప్రియాంక గౌతమ్ తో చెప్పింది.

    గౌతమ్, ప్రియాంకను ఒక చెల్లిగా భావిస్తున్నాడు. అర్జున్ అంటే కూడా గౌరవం. కానీ ప్రియాంక చెప్పిందని అమర్ కి తన పాయింట్స్ ఇచ్చాడు. ఈ విషయంలో గౌతమ్, ప్రియాంకలను హోస్ట్ నాగార్జున ఏకి పారేశాడు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావని ప్రియాంకను నాగార్జున నిలదీశాడు. ప్రియాంక సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. గౌతమ్ నిర్ణయాన్ని నువ్వు ప్రభావితం చేశావు. అర్జున్ కి పాయింట్స్ ఇవ్వకుండా చేశావు. ఇది గ్రూప్ గేమ్ కదా అన్నాడు.

    అలాగే గౌతమ్ కి అర్జున్ కంటే ప్రియాంకనే ఎక్కువని తేలిపోయిందని నాగార్జున అన్నారు. శివాజీ హౌస్లో యావర్, ప్రశాంత్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడని విమర్శించే నువ్వు చేసిందేంటని గౌతమ్ పై ఫైర్ అయ్యాడు. ఇకపై ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలని ప్రియాంక, గౌతమ్ లకు నాగార్జున గట్టిగా మందలించాడు. ప్రియాంక, అమర్ ల గ్రూప్ గేమ్ ని నాగార్జున మరోసారి బయటపెట్టినట్లు అయ్యింది. ఇక సింగిల్ గా అది ఫినాలే అస్త్ర గెలిచిన అర్జున్ ని నాగార్జున అభినందించాడు.