Bigg Boss 7 Telugu: అమర్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు… హోస్ట్ ముందు బరస్ట్ అయిన ప్రియాంక!

శోభా 200 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను సార్ అని చెప్పింది. మరి అంత ఎఫర్ట్స్ పెట్టినా లీస్ట్ లో ఎందుకున్నావు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మీరిద్దరూ మీ పాయింట్లు అమర్ కి ఇవ్వడానికి కారణం ఏంటి అని అడిగారు.

Written By: NARESH, Updated On : December 2, 2023 6:31 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీ,శోభా కి ఇచ్చి పడేసాడు హోస్ట్ నాగార్జున. ముందుగా అర్జున్ ని కి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అర్జున్ అంటూ అభినందించారు. ఇక తర్వాత చాలా ముఖ్యమైన టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి ముందే అవుట్ అయిపోయిన శివాజీ, శోభా ను ప్రశ్నించారు నాగార్జున. మీరు 100 పర్సెంట్ ఇచ్చారా అని అడిగారు. దానికి శివాజీ చెయ్యి బాలేదు బాబు గారు అని చెప్పాడు. రాడ్ టాస్క్ లో చేత్తో కాదు కదా .. కాలితో ఆడాలి కదా అని కరెక్ట్ పాయింట్ లాగాడు నాగార్జున.

ఇక శోభా 200 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను సార్ అని చెప్పింది. మరి అంత ఎఫర్ట్స్ పెట్టినా లీస్ట్ లో ఎందుకున్నావు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మీరిద్దరూ మీ పాయింట్లు అమర్ కి ఇవ్వడానికి కారణం ఏంటి అని అడిగారు. అంటే ఎలాగూ లాస్ట్ వీక్ కూడా వాడికి ఇస్తానని చెప్పాను కదా అని ఇద్దరం ఇచ్చేశాం సార్ అని శివాజీ చెప్పాడు. అంతేనా లేక అమర్ అలుగుతాడనా అని నాగార్జున అన్నారు.

వెంటనే శోభా లేదు సార్ అలగడు అంటూ చెప్పగానే నాగార్జున షాక్ అయ్యాడు. ఏంటి అలగడా .. ప్రియాంక నువ్వు చెప్పమ్మా అని అడిగారు. సార్ తల నొప్పిగా ఉంది .. దాని గురించి ఆలోచిస్తుంటే అంటూ ప్రియాంక మనసులో ఉన్నది కక్కేసింది. అంతలా కంటిన్యూగా ఒకటే లూప్ లో ఉంటాడు కదా అని నాగార్జున అన్నారు. బాల్ గేమ్ లో నువ్వు ఎందుకు ఓడిపోవడానికి రీజన్ ఏంటని ప్రియాంకను నాగార్జున ప్రశ్నించారు.

సంచాలకులు పెట్టిన రూల్స్ అంటూ ప్రియాంక చెప్పింది. ఆ బాధతోనేనా నీ పాయింట్లు గౌతమ్ కి ఇచ్చావా లేక గ్రాటిట్యూడ్ తోనా అని నాగార్జున అడిగారు. అవును సార్ గ్రాటిట్యూడ్ తోనే ఇచ్చాను అని ప్రియాంక అనడంతో మరి ఆ పాయింట్లు మళ్ళీ అమర్ కి ఇవ్వమని గౌతమ్ ని ఎందుకు అడిగావు. అమర్ ఏమైనా నిన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడా అని నేరుగా అడిగేశాడు నాగార్జున. అవును బ్లాక్ మెయిల్ చేశాడని ప్రియాంక తల ఊపింది.