Nagarjuna And Anushka Shetty: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగే హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి(Anushka Shetty). ఈమెని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘సూపర్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ, అందులో సెకండ్ హీరోయిన్ రోల్ చేసినప్పటికీ కూడా అనుష్క కి మంచి పేరొచ్చింది. కానీ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అంత తేలికగా రావు, సూపర్ తర్వాత తన మేనల్లుడు సుమంత్ హీరో గా నటించిన ‘మహా నంది’ లో హీరోయిన్ క్యారెక్టర్ కి అనుష్క ని రికమండ్ చేసింది నాగార్జున నే. ఆ సినిమాకు దర్శకుడిగా సముద్ర వ్యవహరించాడు. అలా అనుష్క కెరీర్ ప్రారంభం లో నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహం మామూలుది కాదు. అందుకే అనుష్క కి నాగార్జున అంటే అంతటి అభిమానం ఉంటుంది. ఆయన తన సినిమాలో నటించమని అడిగితే, రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన రోజులు ఉన్నాయి.
అయితే అనుష్క తో ‘మహానంది’ సినిమా చేసిన సముద్ర, ఆమెతో ‘అరుంధతి’ తర్వాత ‘పంచాక్షరీ’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసాడు. ఈ సినిమాకు నిర్మాతగా అక్కినేని నాగార్జున వద్ద మేకప్ మ్యాన్ గా పని చేసిన చంద్ర వ్యవహరించాడు. ఈ కారణం చేత సముద్ర ని ఒక రోజు నాగార్జున పిలిచి మాట్లాడాడట. ఈ విషయాన్నీ సముద్ర రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నాగార్జున గారు పంచాక్షరీ సమయం లో నన్ను పిలిచి చిన్న హెచ్చరిక జారీ చేసాడు. సముద్ర ఇది అనుష్క కి అరుంధతి లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా. కచ్చితంగా బడ్జెట్ కంట్రోల్ లో ఉండదు. చందు నా దగ్గర మేకప్ మ్యాన్ గా పని చేసే వ్యక్తి . కాస్త చూసుకొని చెయ్యి, వాడి లైఫ్ జాగ్రత్త’ అని చెప్పాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. తన తోటి మనుషుల పై నాగార్జున చూపించే శ్రద్ద, ప్రేమ, ఆప్యాయత ఇలా ఉంటుందని సముద్ర ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. అరుంధతి వంటి భారీ హిట్ తర్వాత అనుష్క నుండి వచ్చిన సినిమా కాబట్టి, ఓపెనింగ్స్ వరకు ఈ సినిమా దంచి కొట్టేసింది. కానీ ఓవరాల్ గా మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత చందు ఏమయ్యాడో, ఇప్పుడు ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు.