Anchor Shyamala: సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీలో అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి. అంతే సులువుగా వదిలించుకుంటారు కూడా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమే. ఎవరి సిఫారసులతో పని ఉండదు. ఎవరి సిఫారసులు అక్కడ పని చేయవు. ఆయనకు ఇష్టం అయితే అందలం ఎక్కిస్తారు. ఇష్టం లేకపోతే వారితో నష్టం అని తెలిసిన పట్టించుకోరు. తన నిర్ణయం తాను తీసుకుంటారు. అయితే వాడుకున్నంత కాలం పార్టీ కోసం వాడుకుంటారు. తరువాత నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఇప్పుడు ఓ ఇద్దరు మహిళ నేతల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే అభిప్రాయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి రోజాకు టికెట్ లేదు అని తేల్చేసారట. మరో మాజీ మంత్రి విడదల రజినీకి అయితే వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయితేనే సీటు అని కండిషన్ పెట్టారట. అయితే ఆమె ప్లేస్ లో కొత్తగా పార్టీలోకి వచ్చిన యాంకర్ శ్యామలను రంగంలోకి దించుతారని ప్రచారం నడుస్తోంది.
* నగిరి కి కొత్త ఇన్చార్జ్..
నగిరి లో రోజా( RK Roja) పరిస్థితి బాగాలేదు. ఆమెను దింపిన ప్రయోజనం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచనకు వచ్చారు. పార్టీ కోసం పని చెయ్.. అధికారంలోకి వచ్చాక చూద్దాం అన్నట్టు ఆమెను సముదాయించినట్లు ప్రచారం నడుస్తోంది. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె విషయంలో సానుకూలంగా. ఒక్క భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం సానుకూలంగా ఉన్నారు. అయితే రోజా కోసం సిఫార్సు చేసే అంతటి పరిస్థితి ఆయనలో కనిపించడం లేదు. త్వరలో నగరికి కొత్త ఇన్చార్జిని ప్రకటించే అవకాశం ఉంది. అది జరిగితే రోజా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటికే ఆమెకు కొంత సంకేతాలు అందాయి. అందుకే ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. తమిళ చిత్రసీమలో అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవు. తమిళనాడులో అయితే అటు చిత్ర పరిశ్రమతో పాటు కొత్తగా విజయ్ పార్టీ ఏర్పాటు చేయడంతో.. ఆ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చని రోజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగిరి కి కొత్త ఇన్చార్జి వస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు.
* యాంకర్ శ్యామల కు ప్రమోషన్..
వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు యాంకర్ శ్యామల( anchor Shyamala). హైదరాబాదులో ఉంటూ ఆమె వైసీపీ రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆమెను ఏపీకి తెచ్చి చిలకలూరిపేట ఇన్చార్జ్ చేసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి అదే జరిగితే రజిని పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పటికే విడదల రజనీకి రేపల్లె వెళ్ళమన్నారట జగన్. ఎన్నికలకు ముందు గుంటూరు పంపించి ఆమెను రాజకీయంగా బలిపశువు చేశారు. ఇప్పుడు చిలకలూరిపేట వస్తానంటే అడ్డుపడుతున్నారు. రేపల్లె వెళ్ళమంటున్నారు. అక్కడ అనగాని సత్య ప్రసాద్ గట్టి నాయకుడిగా ఉన్నారు. మంత్రిగా తన మార్కు చూపుతున్నారు. అక్కడికి వెళ్తే తట్టుకోలేనని రజిని ఆందోళన చెందుతున్నారు. ఉంటే చిలకలూరిపేటలో ఉండి రాజకీయం చేస్తా.. లేకపోతే వేరే పార్టీలో చేరుతానని ఆమె వైసీపీకి లీకులు ఇస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమె విషయంలో సానుకూలంగా లేరు. ఆమెతోపాటు రోజాను వదిలించుకుంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. యాంకర్ శ్యామల అయితే పవన్ కళ్యాణ్ పై పంచ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు. అందుకే ఆమెకు ఒక ఛాన్స్ ఇద్దామని రజినీకి పొగ పెడుతున్నారు. కొద్ది రోజుల్లో ఆ ఇద్దరు మాజీ మంత్రుల భవితవ్యం ఉంది. మొత్తానికి యాంకర్ శ్యామల తన కెరీర్ వదులుకున్నారు కానీ.. ఆమె కెరీర్ కు ఇప్పుడు జగన్ అండగా నిలుస్తున్నారు.