Nagarjuna: ఈరోజు తెల్లవారుజామున అక్కినేని నాగార్జున కి సంబంధించిన N కన్వెన్షన్ హాల్ ని హైడ్రా అధికారులు చెరువుని ఆక్రమించిన అక్రమ కట్టడంగా భావించి కూల్చివేసిన ఘటన పెను దుమారం రేపింది. ప్రతీ విషయంలో కూల్ గా ఉండే నాగార్జున, ఈ ఘటనపై మాత్రం తన అసహనంని మొట్టమొదటిసారి ప్రభుత్వంపై వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా ఆయన వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘కోర్టు ఇచ్చిన స్టార్ ఆర్డర్లను ఏ మాత్రం లెక్క చెయ్యకుండా, చట్టాన్ని ఉల్లంగిస్తూ ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం అత్యంత బాధాకరం. మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున, జనాలకు కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, అలాగే చట్టాన్ని ఉల్లఘించేలా మేము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలపడం కోసం నేను ఈరోజు ఈ ప్రకటన చేసేందుకు మీ ముందుకు వచ్చాను. ఎన్ కన్వెన్షన్ ఉన్నటువంటి భూమి పట్టా భూమి.ఆ భూమి లోని ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ఫక్తు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన కట్టడం అది. ఒకప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం అక్రమ నోటీసు ఇచ్చారు. దీనిపై కోర్టు స్టే కూడా మంజూరు చేయబడింది. ప్రభుత్వం దగ్గర ఈ సమాచారం ఉందో లేదో నాకు తెలియదు కానీ కూల్చివేత మాత్రం చట్ట విరుద్ధంగానే జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు కనీసం మాకు ఒక్క నోటీసు కూడా జారీ చెయ్యలేదు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఇలా చెయ్యడం అన్యాయం. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. ఒకవేళ కోర్టు నాకు కూల్చివేయమని ఆదేశిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
మరో విశేషం ఏమిటంటే, ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గతంలో రేవంత్ రెడ్డి తన కుమార్తెకి పెళ్లి చేసాడు. దానికి సంబంధించిన వీడియో ని నాగార్జున అభిమానులు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు.అక్రమ కట్టడం అని నీకు తెలిసినప్పుడు, అలాంటి చోట నీ కూతురికి ఎలా పెళ్లి చేసావు అంటూ రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నారు నాగార్జున అభిమానులు. ఇది కచ్చితంగా కక్ష పూరిత చర్యనే అని, మా అభిమాన హీరోకి న్యాయం జరగాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
అక్కినేని నాగేశ్వర రావు పై బాలకృష్ణ అప్పట్లో పొరపాటున మాట్లాడిన మాటలపై కూడా స్పందించని నాగార్జున, నేడు ఇంత ఎమోషనల్ గా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం పై స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎల్లప్పుడూ శాంతంగా ఉండే నాగార్జున కి ఇంత కోపం కూడా వస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Nagarjuna fires on abolition of n convention
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com