టెలివిజన్ షోలలో ‘బిగ్ బాస్’కు ప్రత్యేక స్థానం ఉంది. సెలబ్రెటీలు, సామాన్యులతో ఇప్పటివరకు వచ్చిన ‘బిగ్ బాస్’ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే మూడు సీజన్లలో ‘బిగ్ బాస్’ అలరించింది. తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించేందుకు నిర్వాహాకులు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్-4’కు హోస్ట్ గా వ్యవహరించేది వీరేనంటూ సోషల్ మీడియాలో వార్తలు విన్పిస్తున్నాయి. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున పేర్లు ఉండటం ఆసక్తిని రేపుతోంది.
‘బిగ్ బాస్’ మొదటి సీజన్లో ఎన్టీఆర్, రెండో సీజన్లో నాని, మూడో సీజన్లో నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. ఇక నాలుగో సీజన్ గా హోస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ సన్నిహితులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. మహేష్ ఇలాంటి షోలు చేయడంపై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. అలాగే మహేష్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతవరకు సంప్రదించలేదని చెబుతున్నారు.
‘బిగ్ బాస్’ సీజన్లలో ఒక్క ఎన్టీఆర్ మాత్రం హోస్ట్ గా రాణించారు. మిగతావాళ్లు అనుకున్నంతగా ఫార్మామెన్స్ చేయలేదు. ఇప్పటికే నాగార్జున మూడవ సీజన్ కు హోస్టుగా వ్యహరించిన ఆయనే బిగ్ బాస్-4 సీజన్ కు తీసుకోవాలని నిర్వాహాకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్వాహాకులు ప్రకటిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.