https://oktelugu.com/

‘బంగార్రాజు’ పరిస్థితి పై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

అక్కినేని నాగార్జున అభిమానులు గత నాలుగు సంవత్సరాలుగా ఒకే ఒక్క అప్ డేట్ కోసం కళ్ళు వాచిపోయేలా ఆశగా ఎదురుచూస్తున్నా.. ఆ అప్ డేట్ మాత్రం నాగ్ వదట్లేదు. మధ్యలో పరోక్షంగా చెప్పినా అధికారికంగా అతిగతి లేకుండా పోయింది. ఇంతకీ ఆ అప్ డేట్ ఏంటంటే.. ‘బంగార్రాజు’ రాక గురించే. నాగ్ ఫ్యాన్స్ లో ఎప్పటినుండో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయినా.. ‘బంగార్రాజు’ పరిస్థితి ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం విశేషం. నిజానికి అక్కినేని నాగార్జున సూపర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 12, 2021 / 01:46 PM IST
    Follow us on


    అక్కినేని నాగార్జున అభిమానులు గత నాలుగు సంవత్సరాలుగా ఒకే ఒక్క అప్ డేట్ కోసం కళ్ళు వాచిపోయేలా ఆశగా ఎదురుచూస్తున్నా.. ఆ అప్ డేట్ మాత్రం నాగ్ వదట్లేదు. మధ్యలో పరోక్షంగా చెప్పినా అధికారికంగా అతిగతి లేకుండా పోయింది. ఇంతకీ ఆ అప్ డేట్ ఏంటంటే.. ‘బంగార్రాజు’ రాక గురించే. నాగ్ ఫ్యాన్స్ లో ఎప్పటినుండో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయినా.. ‘బంగార్రాజు’ పరిస్థితి ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం విశేషం. నిజానికి అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది.

    Also Read: రాజ‌శేఖ‌ర్ జీవితం గురించి.. మీకు తెలియ‌ని ఎన్నో నిజాలు!

    పైగా ఈ రెండు దశాబ్దాలలో నాగార్జునకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరో సినిమాకి రాలేదు అంటేనే.. ఈ సినిమా రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. పైగా నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించటం, ముఖ్యంగా నాగ్ లుక్ కూడా బంగార్రాజు గెటప్ లో బాగా సెట్ అవ్వడం.. ఇలా మొత్తంగా ఈ సినిమా నాగ్ కి ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందుకే మొదట్లో నాగ్ కూడా ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజును గ్రాండ్ గా చేయాలనుకున్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

    Also Read: రివ్యూ : ఉప్పెన : ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ స్టోరీ !

    నాగ్ ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్ ఇచ్చే అంశమే. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా కనీసం ఇప్పుడన్నా మొదలవుతుందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా పూర్తి చేయాలనే చిత్రబృందం ప్లాన్ ఎంతవరకూ సాధ్యం అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. ఏది ఏమైనా ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్