Chiranjeevi-Nagarjuna: అక్కినేని నాగార్జున – నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు’. భారీ సినిమాల వాయిదా దెబ్బకు సంక్రాంతి రేసులోకి వచ్చింది ఈ సినిమా. ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది. సడెన్ గా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తున్నారు కాబట్టి.. ఓ ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నాగార్జున. అయితే, ఈ ప్రెస్ మీట్ లో టికెట్ ధరల గురించి నాగార్జున అభిప్రాయాన్ని అడిగారు సదరు జర్నలిస్ట్ సోదరులు.

ఆ అభిప్రాయం చెప్పే క్రమంలో నాగార్జున స్పందన మరీ కామెడీగా ఉంది. కామెడీ అనేకంటే విచిత్రంగా ఉంది అని అనడం కరెక్ట్ ఏమో. ఇంతకీ నాగార్జున ఏమి మాట్లాడాడు అంటే.. ‘ఈ ప్రశ్న ఇప్పుడు అనవసరం అనుకుంటా. ఇది మా సినిమా వేడుక, ఇక్కడ నేను రాజకీయ అంశాలను మాట్లాడను’ అంటూ నాగార్జున అని సమాధానం చెప్పుకొచ్చాడు.
మొత్తమ్మీద ఇండస్ట్రీ ఇప్పటి ప్రధాన సమస్య అయిన ‘సినిమా టికెట్ ఇష్యు’ని ఒక రాజకీయ సమస్యగా నాగార్జున తాత తేల్చి చెప్పేశాడు. ఒకపక్క జగన్ ప్రభత్వ కోరల్లో చిక్కి తెలుగు సినిమా పరిశ్రమ నలిగిపోతుంది. అయినా నాగార్జునకు ఇది పరిశ్రమ సమస్య అని అనిపించలేదా ? నాగార్జున ముందు నుంచీ మంచి బిజినెస్ మెన్. తన లాభం తప్ప, మరో వ్యవహారం ఆయనకు ఎక్కదు.
Also Read: సంక్రాంతి పండక్కి ఏడుగురు భామలతో వస్తున్న “బంగార్రాజు”
కానీ, సినిమా వల్ల ఎదిగి, ఇప్పుడు ఆ సినిమా సమస్యలో ఉంది మహా ప్రభో అంటే నాగార్జున ఇలా అర్ధరాహిత్యంగా మాట్లాడి తప్పుకోవడం హాస్యాస్పదం. ‘మా మీద దయచూపి భిక్ష పెట్టండి’ అంటూ చిరంజీవి లాంటి వాళ్ళు వేడుకుంటుంటే.. నాగార్జున మాత్రం కనీసం దాన్ని సమస్యగా కూడా చూడకపోవడం ఆశ్చర్యకర విషయం.
పెద్దల స్థాయిలో ఉన్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చేయాలి, ఇలా నాగార్జున లాగా అంటిముట్టినట్లు ప్రవర్తించకూడదు. అది ఆయన స్థాయికి శోభను ఇవ్వదు. సినీ రంగం పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. న్యాయం చేయమని ఇప్పటికైనా నాగార్జున, జగన్ ప్రభత్వాన్ని అడగాలని ఆశిద్దాం. అలా కాకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉంటే ఎవరికీ ఉపయోగం లేదు.
Also Read: టికెట్ ప్రైస్ ప్రాబ్లమ్ మా సినిమాకు ఉండదు అంటున్న కింగ్ నాగార్జున… కారణం అదేనా ?