Unstoppable Show: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ టాక్‌షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు మంచి బజ్ ఏర్పడింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పిస్తోంది. తొలి సీజన్‌లో భాగంగా మొత్తం 10 ఎపిసోడ్‌లు ముగిశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్వహించిన షోతో తొలి సీజన్‌ను ముగించారు మేకర్స్. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్‌షో అరుదైన ఘనతను సాధించింది.
Thank you for the UNSTOPPABLE Response😀#UnstoppableWithNBK features in the top 10 reality TV list on @IMDb #NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/zEr1LX3IuP
— ahavideoin (@ahavideoIN) January 5, 2022
ఐఎండిబి లోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్ షోకి ఇలాంటి గౌరవం లభించడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎపిసోడ్, ఎపిసోడ్‌కు టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్ షో ఐఎండిబి జాబితాలో 5వ స్థానం పొందింది. దీంతో సెకండ్ సీజన్‌పై మరింత ఆసక్తి నెలకొంది. తొలి సీజన్‌కు మంచి టాక్ రావడంతో రెండో సీజన్‌ను వీలైనంత త్వరగా లైన్‌లో పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు పమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.