Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసినటువంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూ ముందుకు సాగాడు. నాగేశ్వరరావు (Nageshwara Rao) లాంటి నటుడు తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన నట వారసుడిగా వచ్చిన నాగార్జున (Nagarjuna) సైతం తన తండ్రి లెగసిని కంటిన్యూ చేస్తూ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) డైరెక్షన్ లో చేసిన శివ (Shiva) సినిమాతో ఒక్కసారిగా ఆయన మాస్ హీరోగా మారిపోవడమే కాకుండా ఇండియాలో ఉన్న అందరి హీరోలతో పాటు సరి సమానమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కెరియర్ మొదట్లో ఇతను హీరోగా పనికిరాడు అంటూ కొంతమంది హేళన చేసినప్పటికి వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకునేలా నటించి మెప్పిస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. కెరియర్లో ఎన్నో కమర్షియల్ సినిమాలను చేస్తూనే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి గొప్ప చిత్రాలను కూడా చేశాడు. మరి నాగార్జున ఇప్పుడు తన వందో సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
Also Read : 100 కోట్ల బడ్జెట్ తో నాగార్జున 100వ సినిమా..డైరెక్టర్ ఎవరంటే!
ఇప్పటికే కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత తన వందో చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు తనకి కథను వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ కొంతమంది దర్శకులు చెప్పిన కథలు అతన్ని చాలా ఎంగేజ్ చేశాయట. అందులో లోకేష్ కనకరాజ్ కూడా రీసెంట్ గా ఒక కథను అయితే వినిపించారట.
ఇక ఆ కథకి బాగా కనెక్ట్ అయిన నాగార్జున లోకేష్ తోనే తన వందో సినిమా చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు హరీష్ శంకర్, కళ్యాణ్ కృష్ణ లాంటి దర్శకులు కొన్ని కథలను వినిపించినప్పటికి అవి రొటీన్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే ఉండడంతో నాగార్జున ఆ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదట.
ఇక ప్రస్తుతం లోకేష్ డైరెక్షన్ లోనే కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి అతనితోనే తన వందో సినిమాని చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం లోకేష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది.
Also Read : బాలయ్యతో మల్టీస్టారర్ ఆ స్టార్ హీరో చెడగొట్టాడన్న నాగ్, వారి కాంబోలో మిస్ అయిన మూవీ ఏమిటో తెలుసా?