Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ప్రత్యేకంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు డబ్బుల లేమి గురించి, ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజల నిరసనకు కారణం అవుతున్నాయి, ఎందుకంటే ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే హామీలు ప్రజల నమ్మకాన్ని కలిగి ఉంటాయి. కానీ వాటిని వమ్ము చేస్తే ఆ నేతలు పార్టీలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతోంది.
ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి తమ ఓటును వేసినప్పుడు, ఆ హామీలను అమలు చేయలేమని చెప్పడం వారిని మోసం చేసినట్టే అవుతుంది.. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆధారపడినందున, ఇవి అమలు కావడంలో విఫలమైతే ఆగ్రహం సహజంగానే వస్తుంది..
దీంతో సహజంగానే కొందరు రాజకీయ విశ్లేషకులు, చంద్రబాబు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అప్పు భారాలు , నిధుల వ్యయం గురించి పోల్చుతూ చంద్రబాబును విమర్శిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై తన వాదనను బలపరుస్తూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాజేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ప్రజలకు ఇచ్చే హామీలు, వాటి అమలు, ఆర్ధిక పరిమితుల మధ్య సమతుల్యం సాధించడం ప్రతీ ప్రభుత్వానికి ఒక కీలక పరీక్షగా మారుతోంది. చంద్రబాబు ఈ విషయంలో ఫెయిల్ కావడంతో టార్గెట్ అయిపోతున్నారు.
చంద్రబాబు హామీలు అమలు చేయకపోవడంపై జనాలు ఏమనుకుంటున్నారన్న దానిపై విశ్లేషణ ఇదీ..
