Naga Vamsi: ప్రముఖ నిర్మాత నాగవంశీ(Nagavamsi) కి ఇండస్ట్రీ లో దాదాపుగా అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజు తో, ఆయన సోదరుడు శిరీష్ తో నాగవంశీ కి ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు ఆ బంధం తెగిపోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగవంశీ తన ప్రతీ సినిమాను నైజాం ప్రాంతం లో దిల్ రాజు(Dil Raju) కి అమ్ముతూ ఉంటాడు. వీళ్ళ కాంబినేషన్ లో నైజాం ప్రాంతం లో విడుదలైన ప్రతీ సినిమా లాభాలు తెచ్చిపెట్టాయి. ఒకటి రెండు సినిమాలు పోయాయి కానీ, పెద్దగా నష్టాలను తెచ్చిపెట్టని సినిమాలే అవి. అయితే ఇక మీదట నాగవంశీ తన సినిమాలను దిల్ రాజు కి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. దిల్ రాజు కంటే గొప్ప ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు దొరకడంతో నాగవంశీ వాళ్ళ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే నైజాం ప్రాంతం లో దిల్ రాజు కి వ్యాపారం లో ప్రస్తుత భద్ర శత్రువు మైత్రీ మూవీ మేకర్స్. దిల్ రాజు సోదరుడు శిరీష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై తన అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇంటర్వ్యూ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అదే ఇంటర్వ్యూ లో నాగవంశీ ని ఆకాశానికి ఎత్తుతాడు శిరీష్. ఇప్పుడు ఆ నాగవంశీ నే త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ తో చేతులు కలపబోతున్నట్టు తెలుస్తోంది. తన తదుపరి చిత్రాలన్నీ మైత్రీ మూవీ మేకర్స్ కి అమ్మబోతున్నారట. ఇది దిల్ రాజు, శిరీష్ లకు చావు దెబ్బ లాంటిది అనే చెప్పాలి. భవిష్యత్తులో ఈ పరిణామాలు కారణంగా ఎలాంటి సంఘటనలు ఎదురు అవ్వబోతున్నాయో చూడాలి. ఈ సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ మూవీ నైజాం హక్కులను కూడా నాగవంశీ దిల్ రాజు కే ఇచ్చాడు.
సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం కమర్షియల్ గా దిల్ రాజు కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి ఈ ఏడాది మరో 5 సినిమాలు రాబోతున్నాయి. అన్నిటికీ మంచి బజ్ ఉంది. భారీ లాభాలను ఆర్జించే అవకాశాలను దిల్ రాజు సంస్థ కోల్పోయిందా?, లేకపోతే దిల్ రాజు కి ఎదురు వెళ్లినందుకు నాగవంశీ సినిమాలకు రాబోయే రోజుల్లో థియేటర్స్ కష్టాలు తప్పవా? అనేది చూడాలి.