Naga Vamsi Mass Jathara: రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో, ఈరోజు నుంచే ఈ సినిమాకు ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను గమనించినట్లయితే, ఇది ఒక రొటీన్ రొట్ట కథగా ఒక క్లారిటీ వచ్చేసింది.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
* పాత చింతకాయ పచ్చడి కథ!
ఇంతకుముందు రవితేజ చేసిన విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్, క్రాక్ లాంటి సినిమాలను బేస్ చేసుకొని రాసుకున్న కథగా ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి సీన్, ప్రతి షాట్‌లో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన పాత సినిమాల రిఫరెన్స్‌లు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఒక అవుట్ డేటెడ్ కథతో సినిమా చేయడం అవసరమా? అనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
రవితేజ వరుసగా కమర్షియల్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఫ్లాప్ అయినా కూడా ఆయన తన పంథాను మార్చుకోవడం లేదు. దర్శకులు సైతం ఆయనకు అలాంటి సినిమాలనే డిజైన్ చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా మొత్తం రొటీన్ రొట్టగానే ఉండబోతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీంతో, ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించదనే అంచనా కూడా వచ్చేసింది. పాటలు సైతం పెద్దగా ఇంపాక్ట్‌ను ఇవ్వలేకపోయాయి.
*డిజాస్టర్లతో సతమతమవుతున్న నిర్మాత!
ఇలాంటి సమయంలో ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పటికే వార్ 2, కింగ్ డమ్ లాంటి వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. నిజానికి ‘మాస్ జాతర’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ, ఈ సినిమా మీద సరైన నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సోలో రిలీజ్ కోసం వేచి చూశారు. కనీసం సోలో రిలీజ్ చేస్తే అంతో ఇంతో కలెక్షన్లు వస్తాయని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికైతే సోలో రిలీజ్‌కే వచ్చారు. కానీ, అనుకోకుండా బాహుబలి: ది ఎపిక్ పోటీకి రావడంతో నిన్న రావాల్సిన ‘మాస్ జాతర’ ఈరోజు రిలీజ్ అవుతోంది.
* డిస్ట్రిబ్యూటర్ల అనాసక్తి!
ఇక, ఇలాంటి నాసిరకం కథలతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి, ‘మాస్ జాతర’ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. దాంతో, నాగవంశీ కొంతమందిని సెట్ చేసి మరీ ఈ సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాతో మరొక ఫ్లాప్‌ను మూటగట్టుకుంటే మాత్రం, నాగవంశీ కెరీర్ చాలావరకు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.