Telugu Film Writer: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రోజులు అవకాశాల కోసం ఎదురుచూస్తూ, తమ కెరియర్ మొత్తాన్ని సినిమా మీద ధారపోసి ఒక్క సక్సెస్ ని సాధించడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు వాటిని వాడుకొని టాప్ రేంజ్ కి వెళుతుంటే, మరికొంత మందికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి కథ ఉండాలి. మంచి కథలను ఇచ్చే రైతులను ఎవ్వరు పట్టించుకోరు. ఇండస్ట్రీలో రైటర్లకు వాల్యూ లేదనే విషయం ప్రతిసారి ప్రూవ్ అవుతూనే వస్తోంది. రైటర్లకి వాల్యూ పెంచి వాళ్ళు కూడా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేయొచ్చని నిరూపించిన ఒకే ఒక రచయిత ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’… ఆయన ఎంటైర్ కెరీర్లో మంచి సినిమాలకు కథ మాటలు రాసి స్టార్ రైటర్ గా మారాడు.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
ఇక తర్వాత దర్శకుడిగా కూడా మంచి సినిమాలను చేసి స్టార్ హీరోలు అందరికి గొప్ప విజయాలను అందించాడు… కెరియర్ స్టార్టింగ్ లో నువ్వేకావాలి, స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత ‘మన్మధుడు’ సినిమా కోసం కోటి రూపాయాల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశాడు.
ఒక సినిమాకి కథ మాటలు ఇవ్వడానికి తనకి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నాగార్జున కోటి రూపాయలు ఇచ్చి ఆ కథని తీసుకున్నాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ అయింది.అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్లకు సైతం కేవలం 60 లక్షల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసేవారు. కానీ 4 సినిమాలు సక్సెస్ అవ్వడంతో త్రివిక్రమ్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేశారు. కొంతమంది సీనియర్ రైటర్స్ సైతం త్రివిక్రమ్ ను తొక్కేయడానికి ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు…
కానీ ఆయన కథలకు అప్పట్లో అలాంటి డిమాండ్ ఉండేది అందుకే ప్రొడ్యూసర్స్ సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు…ఒక రకంగా రైటర్ల స్టామినా పెంచిన వ్యక్తి కూడా త్రివిక్రమ్ గారే అంటూ ఇప్పటికీ ఆయన్ని చాలా మంది కొనియాడుతూ ఉంటారు…ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడిగా విభిన్న కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమా సైతం డిఫరెంట్ కోణంలో ఉండబోతుందట. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో డిఫరెంట్ సబ్జెక్టు లను డీల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…