Naga Vamsi: ఈమధ్య కాలం లో ప్రముఖ నిర్మాత నాగవంశీ(Nagavamsi) ఆడియన్స్ చేత ఏ రేంజ్ ట్రోల్స్ కి గురి అయ్యాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని నాగవంశీ కొనుగోలు చేసాడు. ఈ సినిమా మన తెలుగు లో ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. 92 కోట్ల రూపాయలకు నాగవంశీ తెలుగు రైట్స్ ని సొంతం చేసుకుంటే, ఫుల్ రన్ లో ఆ చిత్రం కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. అసలే కింగ్డమ్ ఫ్లాప్ తో నష్టాల్లో ఉన్న నాగవంశీ ని, ‘వార్ 2’ చిత్రం కోలుకోలేని చావు దెబ్బ కొట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ కాస్త హద్దులు దాటి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
చాలా మంది నాగవంశీ బలుపు మాటలు కారణంగానే ‘వార్ 2’ చిత్రం ఫ్లాప్ అయ్యిందని అంటుంటారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత నాగవంశీ కొన్ని రోజులు అజ్ఞాతం లోకి వెళ్లిపోవడం, సోషల్ మీడియా లో ఆయనపై ఎన్నో కథనాలు రావడం, దుబాయి లో నష్టాలను పూడ్చడం కోసం తన ఆస్తులను అమ్ముకున్నాడు వంటి వార్తలు పెద్ద దుమారం రేపాయి. కానీ అవన్నీ పుకార్లే అని నాగవంశీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే మీడియా ముందుకు ఇప్పట్లో రాకూడదు అని అనుకున్న నాగవంశీ, నిన్న ‘కొత్త లోక'(Kotha Lokh) సక్సెస్ మీట్ తో మరోసారి జనాల్లోకి వచ్చాడు. మలయాళం లో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సూపర్ హీరో చిత్రం లో కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది. కమర్షియల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ 100 కోట్ల గ్రాస్ మార్కు వైపు పరుగులు తీస్తుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని నాగవంశీ కొనుగోలు చేసాడు. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నాగవంశీ ప్రస్తుతం ఎదురుకుంటున్న గడ్డు పరిస్థితి నుండి కొంత బయటపడినట్టే అనుకోవాలి. అయితే నిన్నటి సక్సెస్ మీట్ లో నాగవంశీ మైక్ పట్టుకొని మాట్లాడేందుకు వణికిపోయాడు. యాంకర్ సుమ బలవంతంగా ఆయన చేత మాట్లాడించింది. ఆయన మాట్లాడుతూ ‘నా స్నేహితుడు జోమ్ దుల్కర్ సల్మాన్ గారి ప్రొడక్షన్ లో పని చేస్తుంటాడు. ఈ సినిమా టీజర్ రాగానే నాకు పంపించాడు. చాలా నచ్చింది, జోమ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ని ఎవరికీ ఇవ్వకు, నేను రిలీజ్ చేస్తాను అని చెప్పాను. కానీ పని చాలా లేట్ గా చేసాడు. అతని వల్లే ఈ సినిమాని మేము భారీగా విడుదల చేయలేకపోయాము. తెలుగు జనాలకు ఈ సినిమా ఇంకా పూర్తిగా రీచ్ అవ్వలేదు, రెండవ వీకెండ్ లో అయినా పుంజుకుంటుంది అని ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసి దుల్కర్ సల్మాన్ గారిని పిలిచాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో.
