Naga Shaurya : ప్రాచీన క్రీడా నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘లక్ష్య’. మీకు తెలుసా ? నాగశౌర్య.. ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్. నాగశౌర్య ఆ రోజుల్లో పలు జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, అశ్వత్థామ లాంటి సినిమాలతో మంచి హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి శౌర్య తన ఒకప్పటి ఇష్టమైన క్రీడా నేపథ్యంలో సినిమా చేశాడు.
ఇక లక్ష్య సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమా కోసం స్పోర్ట్స్ మీద బాగానే రీసెర్చ్ సినిమా చేశాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక బలమైన ఎమోషన్ తో సినిమా తీసి మెప్పించడం కష్టం. మెయిన్ గా మంచి బడ్జెట్ ఉండాలి. సంతోష్ జాగర్లపూడి టేకింగ్ విషయంలో మెప్పించినా, తగిన విధంగా సినిమాకి బడ్జెట్ లేకపోవడంతో సెకెండ్ హాఫ్ లో కొంతవరకు సినిమాకి మైనస్ అయింది.
దాంతో కథ ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ సెకండాఫ్ మాత్రం చాలా స్లోగా నడిపించాడు. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఒకటి రెండు పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఒక డ్యూయెట్ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొత్తమ్మీద నాగశౌర్య ఈ సినిమా కోసం చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు.
కెరీర్ లో మొదటిసారి భారీ వర్కౌట్స్ చేసి.. సిక్స్ ప్యాక్ చేసి మరీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువమంది హ్యాండ్సమ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఆరడుగుల పొడవు… ఎర్రటి రంగు.. మాంచి స్మైలింగ్ ఫేస్.. అన్నీ ఉన్నాయి. అందుకే, శౌర్య అనగానే క్రేజీ హీరోల్లో ఒకడు అనే క్రెడిట్ వచ్చింది.
దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు శౌర్య. పైగా తనకు ఉన్న లవర్ బాయ్ అనే ఒక ఇమేజ్ ను బాగా ప్రమోట్ చేసుకుంటూ.. క్లాస్ హీరోగా ఎదగడానికి శౌర్య ఈ సారి పక్కా ప్లాన్ తో సినిమాలు చేస్తున్నాడు.