https://oktelugu.com/

Jr NTR : మళ్ళీ కలిపేసుకుంటున్నారు, ఒక్క ఎన్టీఆర్ ను తప్ప!

Jr NTR :  నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని   తెలుగు ప్రేక్షకులు తమ కుటుంబంగా భావిస్తారు. అన్నగారి కుటుంబం అంటూ ఆ కుటుంబ సభ్యులను తమవాళ్లుగా ఓన్ చేసుకుంటారు. అయితే, రాజకీయ పరంగా జరిగిన ఎన్నో నాటకీయ సంఘటనల మధ్య  ఆ కుటుంబంలో ఎన్నో జరిగాయి. కుటుంబ సభ్యుల మధ్యే మాటలు లేని పరిస్థితులు వచ్చాయి.    Nara and Daggubati Families  కానీ, ఆ గ్యాప్ ఇప్పుడు తగ్గిపోయినట్టు కనిపిస్తోంది.   ఎన్టీఆర్  ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ […]

Written By: , Updated On : December 10, 2021 / 07:02 PM IST
Nara and Daggubati Families

Nara and Daggubati Families

Follow us on

Jr NTR :  నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని   తెలుగు ప్రేక్షకులు తమ కుటుంబంగా భావిస్తారు. అన్నగారి కుటుంబం అంటూ ఆ కుటుంబ సభ్యులను తమవాళ్లుగా ఓన్ చేసుకుంటారు. అయితే, రాజకీయ పరంగా జరిగిన ఎన్నో నాటకీయ సంఘటనల మధ్య  ఆ కుటుంబంలో ఎన్నో జరిగాయి. కుటుంబ సభ్యుల మధ్యే మాటలు లేని పరిస్థితులు వచ్చాయి. 

 Nara and Daggubati Families

Nara and Daggubati Families 

కానీ, ఆ గ్యాప్ ఇప్పుడు తగ్గిపోయినట్టు కనిపిస్తోంది.   ఎన్టీఆర్  ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ ఒక్కటి అయిపోయారు.  ముఖ్యంగా అసలు ఒకరి ముఖాలు  ఒకరు  చూసుకోవడానికి కూడా ఇష్టాపడని   దగ్గుబాటి, నారా కుటుంబాలు మొత్తానికి  ఓ వేదిక పై కలిసి మెలిసి సరదగా  కనిపించారు.  ముఖ్యంగా  నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు  పక్కపక్కనే నుంచొని కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

 అసలు తెలుగు రాజకీయాల  గురించి తెలిసిన ఎవరైనా  ఈ పరిణామాన్ని  ఎన్నడూ ఊహించి ఉండరు.  కానీ ఆ ఊహలకు కూడా అందని విధంగా  నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కలిసిపోయారు.   వీరి కలయికకు కారణం..  ఎన్టీఆర్ చిన్న  కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహ  నిశ్చితార్థ వేడుక వేదిక  అయింది.  హైదరాబాద్‌లో జరిగిన  ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం అంతా హాజరై సందడి చేసింది. 

 jr ntr donates 25 lakh rupees to andhra pradesh flood victims

  మొదట ఈ వేడుకకు  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చారు. ఆ తర్వాత  బీజేపీ నేత పురందేశ్వరి  కూడా  తన భర్తతో సహా వేడుకకు వచ్చారు. సహజంగా బాబు –   పురందేశ్వరి ఎదురు పడటానికి కూడా ఇష్టపడరు. కానీ, ఈ సారి చంద్రబాబు మాత్రం పురందేశ్వరిని, దగ్గుబాటి వెంకటేశ్వర్రావుని స్వయంగా ఆహ్వానించారు.           

 తమ  మధ్య నెలకొన్న  రాజకీయ బేధాలను  పక్కన బెట్టి   ఆత్మీయంగా కలిసి  మాట్లాడుకుని సరదాగా గడిపారు.  నిజానికి  చంద్రబాబు పేరును  ప్రస్తావించడానికి కూడా  దగ్గుబాటి వెంకటేశ్వర్రావు  ఇష్టపడే వారు కాదు.  సేమ్ అలాగే చంద్రబాబు కూడా ఫీల్ అయ్యేవారు. కానీ, ప్రస్తుత టీడీపీ ధీనస్థితి చూశాకా, మొత్తానికి బాబులో మార్పు వచ్చింది. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిపేసుకుంటున్నారు, ఒక్క  జూనియర్ ఎన్టీఆర్ ను తప్ప.  

Tags