Naga Shourya- NTR: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తారల సినిమాల విషయాలతోపాటు వారి వ్యక్తిగత విషయాల కోసం వారి ఫ్యాన్స్ నిత్యం వెతుకుతూనే ఉంటారు. మన టాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్లు రిలేటివ్స్ గా ఉన్నారు. అయితే ఇందులో కొద్దిమంది విషయాల గురించి మాత్రమే మనకు తెలుసు. చాలామంది గురించి తెలియదు.

ఇప్పుడు ఓ స్టార్ హీరో యంగ్ హీరోకు రిలేటివ్ అనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో నాగశౌర్య ఇప్పుడు లవర్ బాయ్ గా ఉన్నాడు. చేసింది కొన్ని సినిమాలే అయినా చెప్పుకోదగ్గ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Online Ticket Portal Tender Issue: ఆ కాంట్రాక్ట్ మెగా ఫ్యామిలీకి వస్తుందా ? రాదా ?
ఈ క్రమంలోనే నాగ శౌర్యకు ఎన్టీఆర్ కు బంధుత్వం ఉందని చాలా రూమర్లు వచ్చాయి. కాగా ఈ విషయాలపై నాగశౌర్య గానీ ఇటు ఎన్టీఆర్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు నాగశౌర్య తల్లి ఉషా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. వాస్తవంగా నాగశౌర్య ఎన్టీఆర్ కు ఎలాంటి బంధుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు.

కాకపోతే వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అన్నా నందమూరి కుటుంబం అన్నా నాగశౌర్యకు ఎంతో గౌరవం అంటూ చెప్పుకొచ్చింది. అంతే తప్ప అంతకు మించి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదని.. కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారు అంటూ చెప్పింది. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి కజిన్ మాత్రం నాగశౌర్యకు బెస్ట్ ఫ్రెండ్ అని వివరించింది. అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధుత్వం లేదని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం నాగ శౌర్య తన సినిమాలపైనే దృష్టి పెట్టాడని.. ఇప్పట్లో పెళ్ళి లాంటి ఆలోచన తనకు లేదంటూ ఉషా చెప్పుకొచ్చింది.
Also Read:Bigg Boss Telugu OTT: స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతని మీద సిరీయస్..