Naga Shaurya: ‘నాగశౌర్య‘ పెద్దగా క్రేజ్ లేకపోయినా క్రేజీ హీరోగా చలామణి అవుతున్న హీరో. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు శౌర్య. పైగా తనకు ఉన్నా లేకపోయినా లవర్ బాయ్ అనే ఒక ఇమేజ్ ను బాగా ప్రమోట్ చేసుకుంటూ.. క్లాస్ హీరోగా ఎదగడానికి శౌర్య ఈ సారి పక్కా ప్లాన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాగశౌర్య రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేశాడు.

ఆ రెండు సినిమాలు కూడా ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. కాబట్టి.. రిలీజ్ డేట్లు కోసం రెండు సినిమాలు రేసులో ఉన్నాయి. దాంతో తప్పక తన రెండు చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని శౌర్య ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ రెండు చిత్రాల సంగతికి వస్తే.. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఒకటి.
ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత తన మరో సినిమా ‘లక్ష్య’. ఈ సినిమాని నవంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్రస్తుతం శౌర్య టీమ్ కసరత్తులు చేస్తోంది. ఈ చిత్రం విలువిద్య నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా కాబట్టి… కచ్చితంగా ప్రేక్షకులకు సినిమా పై కొంత ఆసక్తి ఉంటుంది.
అందుకే, శౌర్య కూడా 20 రోజుల తేడాతో రెండు సినిమాల రిలీజ్ ను ప్లాన్ చేశాడు. పైగా లక్ష్య సినిమాని ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు శరత్ మరార్ తో కలిసి నిర్మించారు. లవ్ స్టోరీతో నారాయణ దాస్ టీమ్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కాబట్టి.. శౌర్య సినిమాకి ప్లస్ కానుంది. మరి రెండు వారాల గ్యాప్ లో ఒకే హీరో నుంచి వస్తోన్న ‘వరుడు కావలెను’ – లక్ష్య సినిమాలను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.
మొత్తమ్మీద ‘నాగశౌర్య’ చేస్తున్న మరో మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. నిజానికి ఒకటి రెండు హిట్లు తప్ప శౌర్య కెరీర్ లో పెద్దగా హిట్స్ లేవు. అయినా ‘నాగశౌర్య’ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.