ఏపీలో టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం

ఏపీలోని అనంతపురం జిల్లాలో టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం నిక్షేపాలు ఉన్నాయట. 10 చోట్ల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది.   ప్రాంతాల్లో భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టన్న మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్ ఉంటుంది. అత్యధికంగా ఔకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని […]

Written By: Velishala Suresh, Updated On : September 27, 2021 11:17 am
Follow us on

ఏపీలోని అనంతపురం జిల్లాలో టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం నిక్షేపాలు ఉన్నాయట. 10 చోట్ల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది.   ప్రాంతాల్లో భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టన్న మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్ ఉంటుంది. అత్యధికంగా ఔకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

భూగర్భ గనులుగా ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు వెల్లడించారు. మార్కెట్ లో ప్రస్తుతమున్న బంగారం ధరలను బట్టి ఈ ప్రాంతాల్లో గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల గోల్డ్, వజ్రాలు, బేస్ మెటల్, కాపర్, మాంగనీస్, ఇనుప ఖనిజ బ్లాక్ లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ ఏరియాల్లో మరింత ఖనిజాన్వేషన చేసేందుకు వీలుగా కాంపోజిట్ లైసెన్సు ఇవ్వనున్నారు. వీటితో పాటు రాష్ట్ర గనులశాఖ గుర్తించిన 10 బంగారు నిక్షేపాల ప్రాంతాలకు కూడా కాంపోజిట్ లైసెన్సు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చారు.

ఆ ఏరియాలో ఖనిజ నిల్వలపై మరింత ఫోకస్ పెట్టి.. అన్వేషణ చేసుకోవాలి. పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్ లీజు కేటాయిస్తారు. కాంపోజిట్ లైసెన్సు జారీకి త్వరలో ఈ-వేలం నిర్వహిస్తామని గనులశాఖ అధికారులు తెలిపారు. రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ గనులు ఉండేవి. వీటలో 2001 నుంచి తవ్వకాలు ఆపివేశారు. ఇప్పుడు దీనికి దగ్గర్లోని 2 ప్రాంతాల్లో, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలం జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమింకగా గుర్తించారు.