Naga Shaurya: యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థకు గురైనట్లు సమాచారం అందుతుంది. ఆయన షూటింగ్ సెట్స్ లో సొమ్మసిల్లి పడిపోయారట. వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. నాగ శౌర్య లేటెస్ట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతుంది. నాగ శౌర్యపై కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ తెరకెక్కిస్తున్నారట. విరామం లేకుండా షూటింగ్ జరుపుతుండగా నాగ శౌర్య ఒక్కసారిగా కుప్పకూలారట. ఆందోళన చెందిన యూనిట్ సభ్యులు ఆయన్ని వెంటనే గచ్చిబౌలిలో గల ఏఐజి హాస్పిటల్ కి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారట. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారని వెల్లడించారట. కొన్ని రోజులుగా నాగ శౌర్య జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అనారోగ్యంతోనే నాగ శౌర్య షూటింగ్ కి హాజరవుతున్న నేపథ్యంలో ఇలా జరిగిందన్న వాదన వినిపిస్తోంది. నాగ శౌర్య హీరోగా ప్రస్తుతం మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి, పోలీసువారి హెచ్చరిక, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
కాగా మరో ఐదు రోజుల్లో నాగ శౌర్య వివాహం. బెంగుళూరు వేదికగా అనూష శెట్టి అనే అమ్మాయితో నాగ శౌర్య పెళ్లి నిశ్చయించారు. రెండు రోజులు నాగ శౌర్య-అనూష శెట్టి వివాహం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నవంబర్ 19న మెహందీ వేడుక. 20వ తేదీ ఉదయం 11:25 నిమిషాలకు ముహూర్తం. బంధు మిత్రులతో పాటు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం.

కర్ణాటకకు చెందిన అనూష శెట్టి ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్. బెంగుళూరు వేదికగా ఆమె ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. యంగ్ లేడీ ఇంటర్ప్రెన్యూర్ గా అనూష శెట్టి పలు అవార్డ్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక నాగ శౌర్య అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి కొద్దిరోజులు ముందు ఇలా జరగడమేంటని చింతిస్తున్నారు. అయితే నాగ శౌర్య ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.