Homeఎంటర్టైన్మెంట్Naga Shaurya Teaser Talk: టీజర్ టాక్ : ఆకట్టుకున్న  “కృష్ణ...

Naga Shaurya Teaser Talk: టీజర్ టాక్ : ఆకట్టుకున్న  “కృష్ణ వ్రింద విహారి టీజర్ !

Naga Shaurya Teaser Talk: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రసుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని “కృష్ణ వ్రింద విహారి” సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ‘కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా..’ అంటూ మొదలైన ఈ టీజర్ లో లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.

పైగా రొమాన్స్ పాళ్లు ఎక్కువ శాతంతో సాగిన ఈ టీజర్ ఎంటర్టైనర్ గా అనిపించింది. హీరో.. హీరోయిన్ ప్రేమ కోసం పడే ఆరాటం దగ్గర నుంచి.. అతన్ని చూడగానే ఆమె చూపించే అలకలు వరకూ.. అలాగే మధ్యలో హీరో బుజ్జగింపులు కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర హీరో చెప్పే డైలాగ్ కూడా టీజర్ లో బాగా హైలైట్ అయ్యింది.

Naga Shaurya Teaser Talk
Naga Shaurya

ముఖ్యంగా ఈ గంట స‌ప్పుడేంద‌య్యా.. ద‌గ్గ‌ర్లో గుడి లేదు, చ‌ర్చి కూడా లేదు అంటూ రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. అలాగే టీజ‌ర్ చివ‌ర్లో శౌర్య చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ‘పెళ్ళిచేసుకుందాం సినిమాలో సౌంద‌ర్యలాగా సెక్స్ అబ్యూస్‌ ఏమైనా ఉన్నా ప‌ర్లేదు. నేను వెంక‌టేష్ క‌న్నా బాగా చూసుకుంటాను’ అంటూ నాగశౌర్య మంచి టైమింగ్ తో చెప్పాడు.

Also Read: Somu Veeraju ABN RK: చంద్రబాబును సీఎం చేయడానికా మీ ప్లాన్.. ఏబీఎన్ ఆర్కేకు లైవ్ లో షాకిచ్చిన సోము వీర్రాజు

ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఎలాగూ టీజ‌ర్ ఆధ్యాంతం ఆక‌ట్టుకుంటుంది కాబట్టి.. సినిమాకి మంచి మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. యువ సంగీత దర్శకుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగుంది. విజువ‌ల్స్ కూడా చాలా బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు.

నాగ‌శౌర్యకు జోడిగా షిర్లే సేటియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు యంగ్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనంతో అలరించాలని కోరుకునే హీరో ‘నాగశౌర్య’. మరి ఈ సినిమాతో హిట్ కొడతాడా ? చూడాలి.

Also Read: Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !

Krishna Vrinda Vihari - Official Teaser | Naga Shaurya | Shirley Setia | Anish R Krishna

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version