https://oktelugu.com/

Tirumala Tirupati: తిరుమల విషయంలో వీరబ్రహ్మంగారు చెప్పినవి నిజమేనా?

Tirumala Tirupati: కలియుగ భగవానుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలు చాలా జరుగుతున్నాయి. పూర్వమే ఆయన లోకాన్ని గురించి తనదైన శైలిలో వర్ణించారు. ఒక్కో విషయంపై వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన విషయాల్లో చాలా వరకు జరిగాయి. జరుగుతున్నాయి. కలియుగ వింత పోకడలపై ఏనాడో తన రాతల్లో స్పష్టం చేశారు. ఘోర విపత్తుల గురించి విశదీకరించారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై కూడా ఆయన ఓ వ్యాఖ్య చేశారు. శ్రీవారి ఆలయం కొన్ని రోజుల పాటు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 28, 2022 / 12:00 PM IST
    Follow us on

    Tirumala Tirupati: కలియుగ భగవానుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలు చాలా జరుగుతున్నాయి. పూర్వమే ఆయన లోకాన్ని గురించి తనదైన శైలిలో వర్ణించారు. ఒక్కో విషయంపై వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన విషయాల్లో చాలా వరకు జరిగాయి. జరుగుతున్నాయి. కలియుగ వింత పోకడలపై ఏనాడో తన రాతల్లో స్పష్టం చేశారు. ఘోర విపత్తుల గురించి విశదీకరించారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై కూడా ఆయన ఓ వ్యాఖ్య చేశారు. శ్రీవారి ఆలయం కొన్ని రోజుల పాటు మూసి వేస్తారని చెప్పడం తెలిసిందే.

    Pothuluri Veerabrahmendara Swamy

    దీంతో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తిరుమలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో బ్రహ్మంగారు చెప్పినవన్ని జరుగుతున్నాయి. ఆయన చెప్పిన వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం కొద్ది రోజులు మూసివేస్తారని చెప్పిన దాంట్లో ఉండటం గమనార్హం. దీంతో కరోనా ఉధృతి నేపథ్యంలో దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఇది బ్రహ్మంగారు చెప్పిందే అని తెలుస్తోంది.

    మరోవైపు వరదల ప్రభావంతో తిరుమల దారులు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో తిరుమలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరబ్రహ్మంగారు చెప్పింది అక్షరాలా జరుగుతోంది. ఆయన చెప్పిన చాలా విషయాలు మనకు కళ్లకు కట్టినట్లే కనిపిస్తున్నాయి.

    Tirupati Current Situation

    ప్రస్తుతం తిరుమల దేవస్థానం పైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. భక్తులు నడవడానికి కూడా వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం పలు విషయాలు మనకు నిజం అయ్యాయి. పగటి వేషగాళ్లు రాజ్యాధికారం చేస్తారని చెప్పారు. ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ వంటి వారు రాజకీయాల్లో వెలిగిపోయిన సంగతి తెలిసిందే. ముండమోపిలు అధికారం చేపడతారు అంటే ఇందిరాగాంధీ భర్త చనిపో యాకే ప్రధానమంత్రి అయిన విషయం తెలిసిందే.

    Also Read: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు షాక్.. ఇవి లేకపోతే అనుమతించరట!

    ఇలా చాలా విషయాలు మనకు నిజం అయ్యాయి. దీంతో వీరబ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఎన్నో రూఢీ అయ్యాయి. ఈ క్రమంలో కలియుగంలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి.

    Also Read: వారికి తిరుమల ఆలయంలోకి ప్రవేశం లేదు..!

    Recommended Video:

    Tags