Naga Chaitanya Wedding: నాగచైతన్య – సమంత విడిపోవడానికి విబేధాలే కారణాలు అని రకరకాల పుకార్లు పుట్టించారు. అయితే, ఇప్పుడు మరో పుకారు వైరల్ అవుతుంది. ఈ సారి చైతు పైన. త్వరలోనే నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం. అందుకే, తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడట. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి.
ఇంతకీ చైతు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. గత కొన్ని నెలలుగా తన బంధువుల అమ్మాయితో చైతు చాలా సన్నిహితంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఆమె పేరు పి అక్షరంతో స్టార్ట్ అవుతుందట. అందుకే తన ఇంటికి పి అనే పేరును చైతు రాయించినట్లు తెలుస్తోంది. మరి చైతు పెళ్లి పై వస్తున్న ఈ పుకార్లలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. నిజానికి చైతు పై గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి.
Also Read: Ram Pothineni Interview: ఇంటర్వ్యూ: రామ్ – ఆమె విషయంలో మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు !
ముఖ్యంగా చైతు తన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలోని హీరోయిన్ మంజిమా మోహన్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నాడని.. చైతు – సామ్ విడిపోవడానికి ఇదే కారణం అంటూ ఓ రూమర్ కూడా హల్ చల్ చేస్తోంది. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే.. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయట. ఈ మధ్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ఏది ఏమైనా చైతు – సామ్ ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో ఇద్దరికీ మంచి గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్దరి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అయినా ఈ జంట విడాకులు తీసుకోవడం బాధాకరమైన విషయం. మరోపక్క చైతు పెళ్లి పై కొత్త పుకార్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read:Tollywood Couples: కలిసున్నారా ? విడిపోయారా ? అయోమయంలో ఉన్న సినిమా జంటలు ఇవే
Recommended Videos