Prabhas: పాన్ ఇండియా హీరోల లిస్ట్ లోకి ఎంత మంది హీరోలు వచ్చి చేరినా.. నెంబర్ వన్ ‘పాన్ ఇండియా హీరో’ అంటే ప్రభాస్ ఒక్కడే. స్టార్ డమ్ లోనే కాదు, మార్కెట్ పరంగా కూడా ప్రభాస్ కి తిరుగులేదు. ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. పైగా ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతితో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకోవడం షాకింగ్ నిర్ణయమే. అయితే, తాజాగా ఈ సినిమా కథ ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఫుల్ లెంగ్త్ ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ ను చూడాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి పోలీస్ యూనిఫామ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే అభిమానులు ప్రభాస్ ను పవర్ ఫుల్ పాత్ర చేయమని పలు సందర్భాల్లో అనేకసార్లు రకరకాలుగా విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే ఇన్నాళ్లకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరబోతోందని టాక్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.
Also Read: Naga Chaitanya Wedding: నాగచైతన్య పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలుసా ?
పైగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక స్పై గా కూడా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ది డబుల్ యాక్షన్ అట. ఒక క్యారెక్టర్ పోలీస్ అయితే, మరో క్యారెక్టర్ స్పై. మరి ఈ డబుల్ యాక్షన్ లో ప్రభాస్ ఏ రేంజ్ యాక్షన్ చేస్తాడో చూడాలి. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రస్తుతానికి అయితే.. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ప్రభాస్ మారుతితో ఈ సినిమా చేయడానికి సైన్ చేయకముందు ఒక కండీషన్ పెట్టాడు. సినిమాని మూడు నెలల్లో ఫినిష్ చేయాలనేది ఆ కండిషన్.
కారణం.. ఈ సినిమాకి నిర్మాత కృష్ణంరాజు. తన పెద్దనాన్నకి లాభాలు తేవడం కోసం ప్రభాస్.. ఇలా సినిమాని ప్లాన్ చేశాడు. ఎలాగూ మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు.
పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే మారుతి చేస్తాడు. ఏది ఏమైనా కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. డైరెక్టర్ గా కూడా మారుతి బాగా సక్సెస్ అయ్యాడు. అందుకే, ప్రభాస్ డేట్లు ఇచ్చినట్టు ఉన్నాడు. మరి మారుతి ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.
Also Read:Ram Pothineni Interview: ఇంటర్వ్యూ: రామ్ – ఆమె విషయంలో మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు !