ఆ మధ్య సినిమా ఫస్ట్ కాపీని టీమ్ మెంబర్స్ కి చూపిస్తే.. ఏమిటండీ మరీ ఇంత స్లోగా.. సీరియల్ లాగా ఉంది అనే కామెంట్స్ నాగ్ వరకూ వెళ్లాయి. దాంతో నాగ్ సినిమా చూసి.. ఎక్కువగా మార్పులు చెప్పాడు. అవి శేఖర్ కి అస్సలు నచ్చలేదు. ఆ తరువాత నిర్మాతలకు నచ్చచెప్పుకున్నాడు. మార్పులు చేసేది లేదు అంటూ ఇంత కాలం ఎలాగోలా నెట్టుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాని నిర్మాతలు సన్నిహితుడైన ఓ డిస్టిబ్యూటర్ చూశాడు. సినిమా చూసాక ఆయన కూడా సినిమా బాగా స్లోగా ఉందని.. సాయి పల్లవి పాత్ర.. హీరో పాత్రను పూర్తిగా డామినేట్ చేస్తోందని ఇలా అయితే హీరో చివరకు డమ్మీ అయ్యే ప్రమాదం ఉందని చెప్పాడట.
దాంతో ఆలోచనలో పడిన శేఖర్ కమ్ముల మొత్తానికి మళ్ళీ సినిమా ఎడిటింగ్ పై కూర్చున్నాడు. వరుసపెట్టి ల్యాగ్ సీన్స్ ను కట్ చేస్తూ ముందుకుపోతున్నాడు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల గత సినినాలన్ని కలిపితే వచ్చిన సినిమాలా ఈ సినిమా ఉందని.. కచ్చితంగా సినిమాలో కొన్ని హీరోయిన్ సీన్స్ ను లేపేయాలని చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని.. శేఖర్ ఎడిటింగ్ చేస్తున్నాడు. కానీ ఈ లవ్ స్టోరీకి హీరోయిన్ సీన్స్ చాలా కీలకం, అవి తీసేస్తే ఇక లవ్ స్టోరలో ఫీల్ కష్టమే అనే ఫీలింగ్ కూడా శేఖర్ కమ్ములలో ఉంది.
అందుకే శేఖర్ కొన్ని సీన్స్ లో కన్విన్స్ అవ్వలేకపోతున్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.