
కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న ఇండియాకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఇండియాలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఈ ఇద్దరు దేశాధినేతలు చర్యలు జరపడం గమనార్హం. ఈ ఫోన్ చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షు జో బైడెన్ కు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు మోదీ ట్వీట్ చేశారు.