Naga Chaitanya: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా నాగ చైతన్య పేరు ముందు ఉంటుంది. సినీ హీరో గా మాత్రమే కాకుండా సమంత ని ప్రేమించి,పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఘటనలు ఆయన్ని నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యేలా చేసాయి. సమంత, నాగ చైతన్య కి సంబంధించిన సోషల్ మీడియా లో వచ్చినన్ని కథనాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నాగచైతన్య ఇప్పుడు శోభిత దూళిపాళ్ల అనే హీరోయిన్ తో రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించి కూడా ఇన్ని కథనాలు రాలేదు. అలాంటిది సమంత, నాగ చైతన్య మధ్య వచ్చిందంటే ఆ జంటకు నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ మూవీ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో నాగ చైతన్య ప్రేమ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తన ‘తండేల్’ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్తూ ‘ తండేల్ చిత్రం ఒక అందమైన ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుంది. ప్రేమికులు ఈ సినిమాని చూస్తున్నంతసేపు తమని తాము వెండితెర మీద చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతారు. ప్రేమ గురించి చెప్పాలంటే, నిజమైన ప్రేమలో చెప్పలేని బాధ కూడా దాగి ఉంటుంది. ఆ బాధ వల్ల ఒక్కోసారి జీవితాలు నాశనం అవ్వొచ్చు. మీరు ఆ బాధని అనుభవించి బయటపడినప్పుడు సదరు వ్యక్తితో మీకు ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మీరు ఈ చిత్రంలో చూస్తారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రతీ ఒక్కరి మనసులకు దగ్గర అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
నిజమైన ప్రేమని అందించి బాధపడినవాడు అనుభవం తో చెప్తున్నట్టుగా నాగ చైతన్య మాటలను చూస్తే అర్థం అవుతుంది. ఈ అనుభవం కచ్చితంగా ఆయనకు సమంత ద్వారానే కలిగి ఉంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘తండేల్’ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ హైక్స్ కూడా అందించారు. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా టిక్కెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయాయి. కచ్చితంగా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే సినిమాగా ‘తండేల్’ నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య ఈ సినిమా ద్వారా కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాటల ద్వారా మంచి హైప్ ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.