Naga Chaitanya- Nagarjuna: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు..టాలీవుడ్ టాప్ 3 హీరో గా ఆయన రెండు దశాబ్దాల వరుకు కొనసాగాడు..విభిన్నమైన పాత్రలతో తన అద్భుతమైన నటన తో నాగార్జున కెరీర్ మొత్తం సాగింది..ఇండస్ట్రీ లో ఆయన చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఏ హీరో కూడా చెయ్యలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..కానీ హీరో గా ఆయన ఎంత సక్సెస్ అయ్యాడో ఆయన ఇద్దరి కొడుకులు ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి.

నాగ చైతన్య కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకీ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టే సినిమాలు ఇప్పటి వరుకు రాలేదనే చెప్పాలి..నాగ చైతన్య అంటే ఇప్పటికి కూడా టయర్ 2 హీరోగానే అందరూ చూస్తారు..ఒక్క లెజెండ్ కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీ లో ఇనాళ్ళు అయినా కూడా నాగ చైతన్య ఇంకా స్టార్ కాకపోడానికి కారణాలు చాలానే ఉన్నాయి..వాటిల్లో ముఖ్యంగా ఆయన స్టోరీ సెలక్షన్ అని చెప్పొచ్చు..కెరీర్ ప్రారంభం నుండే ఆయన లవ్ స్టోరీస్ మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టాడు..అలా కాకూండా ఆయన కమర్షియల్ మాస్ సినిమాలు చేసి ఉంటె కచ్చితంగా స్టార్ అయ్యుండేవాడని ఇండస్ట్రీ లో వినిపించే మాట.
Also Read: Telangana BJP: తెలంగాణలో గెలుపు బీజేపీకి సాధ్యమవుతుందా?
ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల నాగ చైతన్య కెరీర్ లో ఒక సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మిస్ అయ్యింది..నాగ చైతన్య మొదటి సినిమా జోష్..ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..కానీ మంచి సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాకి బదులుగా నాగ చైతన్య తో దిల్ రాజు మొదటి సినిమాగా అనుకున్న చిత్రం కొత్త బంగారు లోకం అనే సినిమా..వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది..ఈ సినిమా స్టోరీ తీసుకెళ్లి తొలుత నాగార్జున కి వినిపించాడట దిల్ రాజు..కానీ ఒక లెజండరీ ఫామిలీ నుండి వస్తున్నా వారసుడి మూవీ కి ఇలాంటి సాఫ్ట్ కథ సరిపడదు అని నాగార్జున ఈ సినిమా రిజెక్ట్ చేసాడట..దానితో ఒక్క అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ని మిస్ చేసుకున్నట్టు అయ్యింది నాగ చైతన్య కి..ఈ సినిమా తో ఆయన లాంచ్ అయ్యి ఉంటె ఆయన కెరీర్ వేరే లెవెల్ లో వెళ్లి ఉండేది అని అక్కినేని అభిమానుల అభిప్రాయం.
Also Read:KCR Vs Modi: ప్రధాని కాదు.. దేశానికి సేల్స్ మెన్ మోడీ.. శ్రీలంక ఆరోపణలపై ఇరికించిన కేసీఆర్
[…] […]
[…] […]