Actress Meena Husband Assets: బాలనటిగా సుమారు 45 సినిమాలకు పైగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన నటి మీనా..తెలుగు, హిందీ , మలయాళం, తమిళం ఇలా అన్ని ప్రాంతీయ బాషలలో హీరోయిన్ గా దాదాపుగా ప్రతి స్టార్ హీరో సరసన నటించింది..అందం తో పాటుగా అభినయం కూడా అద్భుతంగా చూపించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో మీనా కూడా ఒకరు..ఇక కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వస్తూ ఉండేలోపు హీరోయిన్ గా మీనా క్రేజ్ తగ్గుతూ వచ్చింది.

అప్పుడు 2009 వ సంవత్సరం లో బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్య సాగర్ కి ఇచ్చి మీనాకి పెళ్లి చేసారు ఇంట్లో పెద్దలు..ఎంతో అన్యోయంగా వీరి దాంపత్య జీవితం కొనసాగింది..ఈ ఇద్దరి దంపతులకు నైనికా అనే పాప కూడా..పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మీనా సినిమాల్లో నటించడం మానలేదు..ఈ ఏడాది కూడా ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి..సంతోషంగా సాగిపోతున్న మీనా జీవితం లో ఈమధ్యనే ఒక్క విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆమె భర్త విద్య సాగర్ ఇటీవలే తీవ్రమైన అనారోగ్య సమస్య తో మృతి చెందాడు..ఈ సంఘటన ఆమె మనసుని తీవ్రంగా కలిచి వేసింది.
Also Read: Anchor Suma: విచిత్రమైన వ్యాధికి అత్యవసర చికిత్స తీసుకుంటున్న యాంకర్ సుమ
ఇది ఇలా ఉండగా మీనా భర్త విద్యాసాగర్ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..విద్య సాగర్ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి..తన సొంత కృషి తో ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగం ని సంపాదించాడు..మీనా ని ఆయన పెళ్లి చేసుకున్న సమయం లో ఆయన నెల జీతం దాదాపుగా 2 లక్షలకు పైగానే ఉంటుంది.

ఇక మీనా తో పెళ్లి తర్వాత ఆయన దాదాపుగా 7 నుండి 8 దేశాలలో సాఫ్ట్ వేర్ రంగం లో చక్రం తిప్పారు..అంతే కాకుండా ఇతనికి బెంగళూరు లో స్థిరాస్తుల విలువే దాదాపుగా 200 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి మీనా మరియు విద్య సాగర్ కి మధ్య చాలా విభేదాలు ఇటీవల కాలం లో జరిగాయంటూ రూమర్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రూమర్స్ పై మీనా ట్విట్టర్ ద్వారా స్పందించారు..కుటుంబం మొత్తం శోకసంద్రం లో మునిగిపోయిన ఈ తరుణం లో మీ రూమర్స్ తో మరింత మమల్ని బాధపెట్టకండి అంటూ మీనా ఈ సందర్భంగా కోరింది.
Also Read:Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వాటికీ కూడా ఒప్పుకుంది.. కారణం అదే !
Recommended Videos