Naga Chaitanya
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) కెరీర్ ఎట్టకేలకు గాడిలో పడినట్టే. అక్కినేని అభిమానులు మూడవ తరం సేఫ్ గా ఉంది అని ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘తండేల్(Thandel Movie)’ మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నాగ చైతన్య, ఆ సినిమా సక్సెస్ ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడో మనమంతా సక్సెస్ మీట్స్ లో చూస్తూనే ఉన్నాం. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన అక్కినేని ఫ్యామిలీ కి ‘తండేల్’ చిత్రం ద్వారా కొత్త ఊపిరి ఊదాడు నాగ చైతన్య. ఈ సినిమా తర్వాత ఆయన అభిమానులను ఏమాత్రం కూడా నిరాశపర్చకూడదు అని బలంగా నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆయన వరుసగా క్రేజీ కాంబినేషన్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఆయన బాహుబలి నిర్మాతలతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. తనకు తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన అల్లు అరవింద్(Allu Aravind), నాగ చైతన్య కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే బోయపాటి శ్రీను(Boyapati Srinu), నాగ చైతన్య కాంబినేషన్ లో ఈ సినిమా చేయనున్నాడు. బోయపాటి శ్రీను కి అల్లు అరవింద్ తమ సంస్థలో సినిమా చేయాల్సిందిగా అడ్వాన్స్ ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ముందుగా ఈ సినిమాని తమిళ హీరో సూర్య తో చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో సూర్య డేట్స్ సర్దుబాటు కాలేదు. దీంతో బోయపాటి శ్రీను డేట్స్ ని నాగ చైతన్య సినిమా కోసం వాడేందుకు సిద్దమయ్యాడు అల్లు అరవింద్.
ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక నాగ చైతన్య తో సినిమాని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను తో గతంలో అల్లు అరవింద్ ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, అప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ కి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. నాగ చైతన్య ఇమేజ్ కూడా ఈ సినిమా తో మారబోతుందా లేదా అనేది చూడాలి. అయితే బోయపాటి శ్రీను బాలయ్య తో కాకుండా మిగతా హీరోలతో, ముఖ్యంగా యంగ్ హీరోలతో చేసిన సినిమాలు అత్యధిక శాతం ఫ్లాప్స్ గా మిగిలినాయి. అఖండ తర్వాత ఆయన చేసిన ‘స్కంద’ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ యంగ్ హీరోతో సినిమా అంటే ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు కాస్త భయపడుతున్నారు.