Naga Chaitanya: అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ.. కవితకేది కాదనర్హం అన్నాడు శ్రీశ్రీ.. వ్యాపారానికేదీ అనర్హం కాదంటున్నారు.. ఈ తరం నటులు. చివరికి పెళ్లి వీడియోలను కోట్లకు అమ్మేసుకుంటున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సినిమా ద్వారా కోట్లు గడిస్తూనే.. అనేక బిజినెస్ లు చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్, గార్మెంట్ బ్రాండ్స్, సినిమా థియేటర్స్… ఇలా పలు ఇండస్ట్రీలలో అడుగుపెడుతున్నారు. ఇది చాలదు అన్నట్లు ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. పెళ్లి వీడియో హక్కులను అమ్ముకోవడం.
ప్రస్తుతం ఇది సెలెబ్స్ కి కోట్లు కుమ్మరిస్తున్న వ్యాపారం. 2022లో నయనతార వివాహం చేసుకుంది. మహాబలిపురంలో నయనతార-విగ్నేష్ శివన్ ల పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి చాలా తక్కువ సంఖ్యలు అతిథులు హాజరయ్యారు. పరిమితంగా బంధువులను, ప్రముఖులను ఆహ్వానించడానికి ఓ కారణం ఉంది. కాగా నయనతార పెళ్లిని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా రూపొందించింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.
నెట్ఫ్లిక్స్ సంస్థ ఇందుకు నయనతార దంపతులకు రూ. 25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అది నయనతార ఐదు సినిమాల రెమ్యూనరేషన్ తో సమానం. పెళ్లి ఖర్చులు పోను… ఇంకా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. తాజాగా ఈ ట్రెండ్ టాలీవుడ్ కి వ్యాపించినట్లు సమాచారం. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్ కి ఇచ్చారట. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరగనుంది. సమయం దగ్గరపడటంతో పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయి.
నాగ చైతన్య పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 50 కోట్లు చెల్లించి దక్కించుకుందట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఈ పెళ్లికి కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. పెళ్లి సింపుల్ గా చేయాలని నాగ చైతన్య నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయం వెనుక కారణం ఇప్పుడు అర్థం అవుతుంది. పెళ్లి డాక్యుమెంటరీనీ అద్భుతంగా చిత్రీకరించాలి అంటే.. పెద్దగా బంధువుల హడావుడి ఉండకూడదు. అందుకే తక్కువ మందిని ఆహ్వానించారు.
కాగా నాగ చైతన్య రెమ్యూనరేషన్ రూ. 10 కోట్లు లోపే. కానీ పెళ్లి వీడియో హక్కుల ద్వారా ఏకంగా ఐదు రెట్లు ఆర్జించాడు. డబ్బుల విషయంలో పక్కాగా ఉండే నాగార్జున కుమారుడిగా నాగ చైతన్య తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే..