Telangana Politics : తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాగ్రెస్ మధ్య వైరం.. తెలంగాణకు నష్టం కలిగిస్తోంది. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి.. తర్వాత అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. కానీ తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య ఏడాదికిపైగా రాజకీయాలే జరుగుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే మాటల యుద్ధం మొదలైంది. ఎన్నికలు జరిగి ఏడాదైనా.. ఇంకా కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయినా నేతుల మాత్రం తగ్గేదే లేదు అంటోంది. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నాం కాబట్టి తగ్గబోమంటున్నారు. ఇలా కొన్నిసార్లు మాటలు కోటలు దాటి చేతల వరకూ వెళ్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సి బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. కానీ, అది నిర్మానాత్మకంగా ఉండాలి. ప్రజలకు, రాష్ట్రానికి నష్టం చేసేలా ఉండొద్దు. అయితే ఈ రాజకీయాలు తెలంగాణకు నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా అదానీ అవినీతి విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ తీరుతో రాష్ట్రానికి రూ.100 కోట్ల నష్టం జరిగింది.
కేటీఆర్ తీరుతో…
దేశంలో సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైంది. అంచాలు ఇచ్చారన్న అభియోలు నమోదయ్యాయి. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. ప్రధాని మోదీకి సన్నిహితుడైన అదానీపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేత చేస్తున్న ఆరోపణలను బీఆర్‌ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలచుకుని రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ప్రారంభించాయి. సీఎం రేవంత్‌రెడ్డి అదానీకి అంటకాగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలుచేశారు. రాష్ట్రంలో అదానీకి కేటాయించిన ప్రాజెక్టులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రూ.100 కోట్లు వాపస్..
కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీఎం కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరి కారణంగా తెలంగాణకు రూ.100 కోట్ల నష్టం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా యూనివర్సిటీకి అదాని ఫౌండేషన్ తరఫున ప్రీతి అదాని రూ.100 కోట్లు ఇచ్చారు. తాజాఆ అదానీ వివాదం.. దీనిని కేటీఆర్ రాజకీయం చేయడం కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి అదానీ ఫౌండేషన్ కేటాయించిన రూ.100 కోట్లను వాపస్ ఇస్తామని ప్రనకటించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి అదానీ ఫౌండేషన్‌కు లేఖ రాశారు.
సీఎస్సార్ నిధులే..
అదానిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే కొత్త కాదు.. కానీ, అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన అవినీతిపరుడు అయిపోడు. నేరం నిరూపితం కావాలి. కానీ కేటీఆర్ కేవలం తన స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రానికి అదానీ ఫౌండేషన్ కేటాయించిన రూ.100 కోట్లు వాపస్ ఇచ్చేలా చేశాడు. వాస్తవానికి ఈ నిధులు అదానీ అక్రమంగా సంపాదించినవి కావు. ప్రతీ కంపెనీ సోషల్ రెస్పాన్స్‌లో భాగంగా లాభాల్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తాయి. అదానీ ఫౌండేషన్ కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చింది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేటీఆర్ ఇవేమీ ఆలోచించకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి రూ.100 కోట్లు వాపస్ ఇస్తున్నట్లు ఆవేశంగా ప్రకటించారు. దీంతో అదానీ ఫౌండేషన్‌కు ఎలాంటి నష్టం లేదు. మనం రిటర్న్ చేసిన సొమ్మును మరో రాష్ట్రంలో ఖర్చు చేస్తాయి. నష్టపోయేది తెలంగాణే.