
Naga Chaitanya – Sobhita Dulipala అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు ఒంటరివాడు కాదు..ఆయనకు ఒక తోడు దొరికింది. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం పై అటు నాగ చైతన్య కానీ, ఇటు శోభిత కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.కానీ వీళ్లిద్దరు కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లడం,ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చాలానే వచ్చాయి. ఇక నేడు విడుదలైన ఒక ఫోటో తో వీళ్లిద్దరు డేటింగ్ లోనే ఉన్నారు అనే విషయం నిర్ధారణ అయ్యింది.
వివరాలలోకి వెళ్తే.. అక్కినేని నాగ చైతన్య హైదరాబాద్ లో ఒక రెస్టారంట్ ని తన స్నేహితులతో కలిసి గత కొంతకాలంగా నడుపుతున్నాడు. ఈ హోటల్ లో పని చేసే ఒక చెఫ్ ‘సుందర్ మోహన్’ అనే అతను నాగ చైతన్యతో కలిసి ఒక ఫోటో దిగాడు. తన ఇంటికి డిన్నర్ కి వచ్చినందుకు గాను నాగ చైతన్యకి కృతఙ్ఞతలు అంటూ ఒక క్రింద కాప్షన్ పెట్టాడు.
ఇక్కడే నాగ చైతన్య దొరికిపోయాడు. వెనకాల డైనింగ్ టేబుల్ వద్ద శోభిత దూళిపాళ్ల కూర్చున్న విషయం నెటిజెన్స్ కనిపెట్టేసారు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనే విషయం నూటికి నూరుపాళ్లు నిజం అయ్యింది.
ఎంత తప్పించుకుందామన్నా.. ఎక్కడో ఒక చోట దొరకక పోరు. ఇప్పుడు నాగచైతన్య కూడా ఇలానే అడ్డంగా దొరికేశాడు. ఇప్పుడు ఈ ఫొటోతో నాగచైతన్య తన కొత్త డేటింగ్ శోభితతో అని అర్థమైంది. మరి సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో? ఆమె ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి.ౌ
