https://oktelugu.com/

Naga Chaitanya : నాగచైతన్య కి 50 సంవత్సరాలు వచ్చేసరికి తన కొడుకు, కూతురు ఇలా ఉండేలా చూస్తాడట…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి నాగచైతన్యకు చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన సినిమాలను తను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన అన్ని సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి...

Written By: , Updated On : February 10, 2025 / 12:09 PM IST
Naga Chaitanya

Naga Chaitanya

Follow us on

Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వర రావు (Nageshwara Rao), నాగార్జున (Nagarjuna) తర్వాత నాగచైతన్య (Naga Chaithanya) కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… నాగచైతన్య సమంత ను పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ల (Shobhitha Dulipalla)అనే మరొక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ‘తండేల్ ‘ (Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులందరు ఈ సినిమాను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రీసెంట్ గా ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. ఇక అందులో డిఫరెంట్ విషయాల గురించి ఆయన తెలియజేస్తూ ప్రేక్షకులను సినిమాల ద్వారా ఎంటర్ టైన్ చేయడానికి తను ఉన్నానని చెప్పాడు.

మరి మొత్తానికైతే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నాగచైతన్య తన కెరీర్ ని చాలా బాగా బిల్డ్ చేసుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇక తనకు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది కూడా తను ఇప్పుడే డిసైడ్ చేసుకుంటున్నాడు. తను 50 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు తనకి ఇద్దరు పిల్లలు ఉండాలని అందులో తన కొడుకు ఒక గోల్ ను పెట్టుకొని ట్రాక్ ని ఏర్పాటు చేసుకొని అందులో ముందుకు దూసుకెళ్తూ ఉండాలని చెప్పాడు.

ఇక కూతురు అయితే తన హాబీస్ ని ఇంట్రెస్ట్ గా మార్చుకొని ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ చెబుతూ ఉండటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఇద్దరూ ప్రస్తుతం అన్యోన్యంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. మరి శోభిత ధూళిపాళ్ళ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు అయితే వస్తున్నాయి.

మరి పెళ్లి తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాకి కమిట్ అయితే అవ్వలేదు… మరి రాబోయే రోజుల్లో ఏదైనా మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో నటిస్తుందా? లేదంటే ఇంటి బాధ్యతను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం నాగచైతన్య మంచి సక్సెస్ ని అందుకున్నాడు. కాబట్టి ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తోంది…