https://oktelugu.com/

Thandel Collections : గంటకు 16 వేల టిక్కెట్లు..2వ రోజు చరిత్ర తిరగరాస్తున్న నాగచైతన్య ‘తండేల్’..ఆ ప్రాంతాల్లో ‘పుష్ప 2’ కూడా అవుట్!

ఈ సినిమాకి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాయి. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం కేవలం 18 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే ఉంది. కానీ నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ అని మాత్రం చెప్పొచ్చు. మొదటిరోజు సంగతి కాసేపు పక్కన పెడితే, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి.

Written By: , Updated On : February 8, 2025 / 07:30 PM IST
Thandel Movie 2nd Collections

Thandel Movie 2nd Collections

Follow us on

Thandel Collections :  గత కొంతకాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ‘తండేల్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. టాక్ కి తగ్గట్టే నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిల్చింది. నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాయి. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం కేవలం 18 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే ఉంది. కానీ నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ అని మాత్రం చెప్పొచ్చు. మొదటిరోజు సంగతి కాసేపు పక్కన పెడితే, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి.

బుక్ మై షో లో అయితే ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ యే కనిపిస్తున్నాయి. గంటకు 16 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయంటే సాధారణమైన విషయం కాదు. మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండ్ చూపించలేదు. సినిమాకి బయట జనాల్లో అద్భుతమైన పాజిటివ్ టాక్ ఉండడం వల్ల అనేక ప్రాంతాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూసిన అక్కినేని అభిమానులకు ఈ చిత్రం మంచి కిక్ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజే 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండవ రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే 12 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు ఉండొచ్చు.

అలా మొదటి వీకెండ్ లోనే 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రానికి అప్పట్లో దాదాపుగా 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లను ఈ చిత్రం మొదటి వారం పూర్తి అయ్యేలోపే దాటనుంది. ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా నాగ చైతన్య కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాసర్ గా కూడా ఈ చిత్రం నిలవనుంది. విడుదలకు ముందు పాటల కారణంగా కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని మాత్రం ఊహించి ఉండరు. కేవలం నాగచైతన్య అభిమానులనే కాకుండా అక్కినేని అభిమానులను ఈ సినిమా ఫలితం ఎంతో సంతృప్తి పర్చింది.