Naga Chaitanya – Sobhita wedding : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో సుదీర్ఘంగా డేటింగ్ చేసి రీసెంట్ గానే పెద్దల సమక్ష్యంలో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నిశ్చితార్ధ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా గత రెండు మూడు రోజులుగా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా అక్కినేని నాగార్జున వీళ్లిద్దరి పెళ్లి తేదీ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘వాళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని నాకు ముందుగా తెలియదు. సడన్ గా అప్పటికప్పుడు అనుకోని చేసేసుకున్నారు.
ఇద్దరి కెరీర్స్ ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్నాయి. కాబట్టి పెళ్లి ఇప్పట్లో లేదు, కొంచెం సమయం పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రిటీలు నిశ్చితార్థం చేసుకున్న రెండు మూడు నెలలకు పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ హీరో శర్వానంద్ అయితే దాదాపుగా నిశ్చితార్థం తర్వాత ఆరు నెలలకు పైగానే సమయం తీసుకున్నాడు. నాగచైతన్య – శోభిత కూడా అంత సమయం తీసుకుంటారా అని అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం నాగ చైతన్య కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి తో కలిసి ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం గా చెప్పుకోవచ్చు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తప్పనిసరి. కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, ఈ సినిమా అక్కినేని కుటుంబం మొత్తానికి కూడా ఎంతో ముఖ్యం.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించింది. ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అక్టోబర్ మిస్ అయితే డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. అంటే అప్పటి వరకు నాగ చైతన్య – శోభిత పెళ్లి జరగదు అన్నమాట. నాగార్జున కూడా నేడు క్లారిటీ ఇవ్వడం తో దాదాపుగా ఖరారు అయ్యనట్టే. ఇక శోభిత దూళిపాళ్ల చేతిలో కూడా బాలీవుడ్ లో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇవి పూర్తి అయ్యాకనే ఆమె కూడా పెళ్లికి సిద్ధం అవుతుందట. కాబట్టి అక్కినేని అభిమానులు ఈ కనులపండుగని చూసేందుకు కాస్త నిరీక్షించక తప్పేలా లేదు. ఈ పెళ్ళికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.