Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: సమంత రెండో పెళ్లి... నాగచైతన్య సంచలన వీడియో వైరల్!

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి… నాగచైతన్య సంచలన వీడియో వైరల్!

Naga Chaitanya: చాలా కాలం నుండి రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో డేటింగ్ చేస్తున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిన్న కోయంబత్తూరు లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కి కేవలం సమంత , రాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఒక్కరికి కూడా రాలేదు. సమంత కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపాసన వంటి వారు కూడా ఇన్ స్టాగ్రామ్ లో సమంత అప్లోడ్ చేసిన […]

Naga Chaitanya: చాలా కాలం నుండి రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో డేటింగ్ చేస్తున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిన్న కోయంబత్తూరు లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కి కేవలం సమంత , రాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఒక్కరికి కూడా రాలేదు. సమంత కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపాసన వంటి వారు కూడా ఇన్ స్టాగ్రామ్ లో సమంత అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోల ద్వారానే తెలుసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంత పై మొదటి నుండి సోషల్ మీడియా లో నెగిటివిటీ విపరీతంగా ఉండేది. ముఖ్యంగా నాగచైతన్య(Akkineni Nagarjuna) తో ఆమె విడాకులు తీసుకోవడం పై నెటిజెన్స్ వేసిన ట్రోల్స్ కి సమంత ఏడ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు రాజ్ నిడిమోరు ని రెండవ పెళ్లి చేసుకోవడం పై కూడా ఆమెని తీవ్రంగా విమర్శిస్తున్నారు కొంతమంది నెటిజెన్స్.

ముఖ్యంగా నాగ చైతన్య ఒక సందర్భంలో విడాకులు గురించి మాట్లాడుతూ ‘అమ్మ నాన్న విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. అలాంటిది నేను ఒక బంధం నుండి విడిపోవాలి అనుకున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఆలోచించి ఉంటాను మీరే అర్థం చేసుకోండి’ అంటూ గతం లో ఒక పోడ్ క్యాస్ట్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయన అభిమానులు అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజెన్స్ చైతన్య బంగారం లాంటి మనిషి, కచ్చితంగా సమంత వైపు నుండే తప్పు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల సమయం లోనే నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ ని ఆమె పెళ్లాడింది. అంటే తప్పు కచ్చితంగా సమంత వైపు నుండే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు సమంత ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య అభిమానులకు దీటైన సమాధానం ఇచ్చింది. సమంత తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే నాగ చైతన్య శోభిత తో రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి?, నాగ చైతన్య తప్పు చేసాడు అనుకోవాలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింది అనే విషయం వాళ్లకు, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి మీకు మీరు కథనాలు ఊహించుకోకండి, ఇప్పుడు ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper