Heroines Who Married Directors: సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక హీరోయిన్లు మాత్రం ఒక్క సక్సెస్ వస్తే చాలు ఇండస్ట్రీలో టాప్ లెవెల్ కి వెళ్ళిపోవచ్చు అనే రేంజ్ లో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలువలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వచ్చి ఇంతకు ముందున్న హీరోయిన్ల కంటే అందచందాలను చూపిస్తూ నటనలో కూడా తమ ప్రతిభను చూపిస్తూ టాప్ లెవెల్ కి వెళ్తున్నారు… కొంతమంది హీరోయిన్లు మాత్రం అప్డేట్ అవుతూ 15 నుంచి 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి మరికొంతమంది మాత్రం ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్లిపోయారో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి క్రమంలోనే సమంత లాంటి హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలకు పైన అవుతున్నప్పటికి తను ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండడం విశేషం…ఇక ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలన్నీ ఆమెకు గొప్ప విజయాలను సాధించి పెట్టాయి. తను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే… కానీ వీళ్ళ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన వివాదాలతో విడాకులు తీసుకుని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోగా, ఇప్పుడు సమంతా సైతం ఫ్యామిలీ సిరీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజు నిడిమోరు ను పెళ్లి చేసుకుంది…
సమంత అనే కాకుండా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ లలో దర్శకులను పెళ్లి చేసుకున్నవారెవరో ఒకసారి తెలుసుకుందాం…
కుష్బూ – సుందర్ సి
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా గొప్ప పేరును సంపాదించుకున్న కుష్బూ ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక అప్పుడే తమిళ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సుందరి సి పెళ్లి చేసుకుంది. సుందర్ సి రజనీకాంత్ తో అరుణాచలం లాంటి సూపర్ హిట్ సినిమాని చేయడం విశేషం… ఇక వీళ్ళు అప్పటినుంచి ఇప్పటివరకు చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతుండడం విశేషం…
రోజా – సెల్వమణి
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోలందరితో నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటి రోజా…ఆ తర్వాత పాలిటిక్స్ లో కూడా చక్రం తిప్పుతున్న విషయం మనకు తెలిసిందే. హీరోయిన్ గా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వమణి ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది…
కృష్ణవంశీ – రమ్యకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలను చేసి చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన నటి రమ్యకృష్ణ…హీరోయిన్ గా తన కెరియర్ ను టాప్ లెవెల్ లో ఉన్నప్పుడు గులాబీ, నిన్నే పెళ్ళాడుతా,ఖడ్గం లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కృష్ణవంశీ ని పెళ్లి చేసుకుంది…
రాణి ముఖర్జీ – ఆదిత్య చోప్రా
యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత అయిన ఆదిత్య చోప్రా దర్శకుడిగా నిర్మాతగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే రాణి ముఖర్జీ సైతం హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకోవడంతో వీళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు…
ఇక దర్శకులను పెళ్లి చేసుకున్న వాళ్లలో రీసెంట్ గా సమంత కూడా చేరిపోవడం విశేషం…